పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు దగ్గరపడుతుండటంతో రాజకీయాలు వెడెక్కుతున్నాయి. ఇప్పటికే ఇటు బీజేపీ, టీఎంసీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ క్రమంలోనే మహారాష్ట్ర అధికార పార్టీ శివసేన కీలక నిర్ణయం తీసుకుంది.
దేశంలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ( Congress ) బలహీనపడిందని.. యూపీఏ చైర్మన్‌గా ఎన్సీపీ అధినేత శరద్ పవార్ (Sharad Pawar) నియమితులైతే తమకు సంతోషమేనని శివసేన ప్రకటించింది.
బాలీవుడ్ నటి ఊర్మిళా మతోండ్కర్ (Urmila Matondkar) మహారాష్ట్ర అధికార పార్టీ శివసేన ( Shiv Sena ) లో చేరారు. మంగళవారం మహారాష్ట్ర సీఎం, శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే (Uddhav Thackeray ) సమక్షంలో ముంబైలో ఆమె ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
Sanjay Raut On Arnab Goswami Arrest | అర్నాబ్ గోస్వామిని అరెస్ట్ చేయడం దుమారం రేపుతోంది. ముంబై పోలీసులు అర్నాబ్‌ను అరెస్ట్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ సైతం విమర్శలు గుప్పించారు. అర్నాబ్ అరెస్ట్ అక్రమమని, అన్యాయమని మహారాష్ట్ర ప్రభుత్వం తీరుపై మండిపడుతున్నారు. ఈ విమర్శలపై శివసేన కీలక నేత సంజయ్ రౌత్ స్పందించారు.
బాలీవుడ్ నటి ఊర్మిళ మతోండ్కర్ (Urmila Matondkar) పేరు మహారాష్ట్ర శాసన మండలికి దాదాపు ఖరారు అయినట్లు తెలుస్తోంది. గవర్నర్ కోటాలో మహారాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్‌కు నటి ఊర్మిళ పేరును మహారాష్ట్ర ప్రభుత్వం (Maharashtra government ) నామినేట్ చేయనుంది.
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ వ్యాఖ్యలపై ఎట్టకేలకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే స్పందించారు. దసరా ర్యాలీ సందర్భంగా పరోక్షంగా ఆమె కామెంట్లకు దీటైన సమాధానమిచ్చారు.
మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవిస్ (Devendra Fadnavis), శివసేన కీలక నేత, ఎంపీ, సంజయ్ రౌత్ ( Sanjay Raut ) శనివారం ముంబైలోని ఓ లగ్జరీ హోటల్లో భేటీ అయ్యారన్న విషయం తెలియగానే రాజకీయ వర్గాల్లో అలజడి మొదలైంది. బీజేపీతో బంధం తెగిపోయిన నాటినుంచి ఎప్పుడూ శివసేన బీజేపీపై విరుచుకుపడుతూనే ఉంది. అయితే వారిద్దరి భేటీపై సర్వత్రా చర్చనీయాంశమైంది.
మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, శివ సేన పార్టీ ఎంపీ, కీలక నేత అయిన సంజయ్ రౌత్ ( Devendra Fadnavis, Sanjay Raut meeting ) శనివారం ముంబైలోని ఓ లగ్జరీ హోటల్లో వీళ్లిద్దరూ సమావేశం కావడం రాజకీయవర్గాల్లో చర్చనియాంశమైంది. బీజేపి అంటేనే ఒంటికాలుపై లేస్తున్న శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ( Shiv Sena MP Sanjay Raut ) ఇలా బీజేపి కీలక నేతతో రహస్య మంతనాలు ఏంటా అని అందరూ ఆశ్చర్యపోయారు.
బాలీవుడ్ యువ నటుడు దివంగత సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ (Sushant Singh Rajput) అనుమానస్పద మృతి నాటినుంచి మహారాష్ట్ర, బీహార్ ప్రభుత్వాల మధ్య వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. అయితే ఈ క్రమంలోనే శుక్రవారం కేంద్ర ఎన్నికల సంఘం (CEC) బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్‌ను విడుదల చేసింది.
దేశవ్యాప్తంగా కరోనావైరస్ (Coronavirus) కేసుల్లో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో పలువరు ఎంపీలు.. కరోనా నియంత్రణలో మహారాష్ర్ట ప్రభుత్వం విఫలమయ్యిందని.. విమర్శలు చేశారు. దీంతో ఆ వ్యాఖ్యలను శివసేన నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ తిప్పికొడుతూ గురువారం రాజ్యసభలో పలు ప్రశ్నలను సంధించారు.
కంగనా రనౌత్ ముంబైకి వచ్చిన రోజే ముంబై పురపాలక శాఖ అధికారులు (BMC) ముంబైలోని పాలి హిల్స్‌లో ఉన్న నటి కార్యాలయాన్ని అక్రమ కట్టడమంటూ జేసీబీలతో కూల్చేశారు. అయితే తనకు ముందుగా నోటీసులు ఇవ్వకుండా కూల్చేశారని కంగనా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ వ్యవహారంపై మహారాష్ట్రలో రాజకీయాలు వేడెక్కాయి. తరచూ కాంట్రవర్సీ వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే కంగనా తీరుపై దేశవ్యాప్తంగా ప్రస్తుతం చర్చనీయాంశమైంది. అయితే.. తాజాగా కంగనా ముంబైని పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ (pok) తో పోల్చడంపై శివసేన పార్టీ ఆగ్రహం వ్యక్తంచేస్తోంది.
Rhea Chakraborty At ED Office | బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో ప్రధాన నిందితురాలు, నటి రియా చక్రవర్తి ఎట్టకేలకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) ఆఫీసుకు వచ్చింది.
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కు పేరు, డబ్బు, హోదాను ఇచ్చింది ముంబై అని వ్యాఖ్యానించారు. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉన్న ముంబై పోలీసులు Sushant Singh Rajput కేసును విచారిస్తుండగా బిహార్ జోక్యమెందుకుని శివసేన నేత వ్యాఖ్యానించారు.
దేశవ్యాప్తంగా కరోనా విజృంభణ రోజు రోజుకు పెరుగుతూ పోతోంది. రోజువారి కేసులు సైతం వేలకు వేలు నమోదవుతుండడంతో తీవ్ర ఆందోళన నెలకొంది. కాగా కేసుల నమోదులో మొదటి స్థానంలో మహారాష్ట్ర కొనసాగుతోంది.
దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో వలసకార్మికుల బాధలు వర్ణనాతీతం. అయితే ఇదే క్రమంలో శివసేన పార్టీకి చెందిన సీనియర్ నేత సంజయ్ రౌత్ సామ్నా పత్రిక సంపాదకీయంలో ఘాటైన విమర్శలు చేశారు.
శివసేన పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ ఆసక్తికరమైన ప్రకటన చేశారు. తమ పార్టీ కర్ణాటక ఎన్నికల్లో 60 స్థానాల్లో పోటీ చేస్తుందని తెలిపారు. బీజేపీతో పొత్తు పెట్టుకొనేది లేదని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.