Telangana Assembly Session: తెలంగాణ అసెంబ్లీలో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. సభా హక్కులను ఉల్లంఘనకు గురవుతుండడంతో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ధర్నాకు దిగారు. రోడ్డుపై కూర్చొని ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
KCR Speech In Nalgonda: ఓటమి అనంతరం 'ఛలో నల్లగొండ' బహిరంగ సభతో బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ గర్జించారు. తెలంగాణకు అన్యాయం జరిగినే తన కట్టె కాలే వరకు పోరాడుతానని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తే తాట తీస్తానని హెచ్చరించారు.
Eggs Attack: కృష్ణా ప్రాజెక్టులు నదీ యాజమాన్య బోర్డుకు అప్పగింత వ్యవహారంపై బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చిన 'ఛలో నల్లగొండ' సభకు కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డంకులు సృష్టించారు. మాజీమంత్రులు కేటీఆర్, హరీశ్ రావు ప్రయాణిస్తున్న బస్సుపై కోడిగుడ్లతో దాడికి పాల్పడ్డారు.
YS Sharmila Revanth Reddy Meet: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి పునఃప్రవేశించిన తర్వాత తొలిసారి మళ్లీ తెలంగాణలో వైఎస్ షర్మిల అడుగుపెట్టారు. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రితో సమావేశం కావడం గమనార్హం.
Harish Rao Assembly Speech: తెలంగాణ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు రసవత్తరంగా జరుగుతున్నాయి. బడ్జెట్ సమావేశంలో కృష్ణా ప్రాజెక్టులపై చర్చ జరగ్గా అధికార, ప్రతిపక్షాల మధ్య ఒక యుద్ధమే జరిగింది. హరీశ్ రావు చేసిన ప్రసంగం ఆకట్టుకుంది.
Bonthu Rammohan: అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతున్నాయి. కీలక నాయకులంతా పార్టీని వీడుతున్నారు. తాజాగా హైదరాబాద్‌కు చెందిన కీలక నాయకుడు ముఖ్యమంత్రిని కలిశారు.
Telangana Budget: కొత్తగా ప్రవేశపెట్టిన ఓట్ ఆన్ బడ్జెట్‌పై మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. అసలు ప్రజలకు ఆరు గ్యారంటీలు దక్కవని చెప్పారు. ప్రజలు వాటిపై ఆశలు పెట్టుకోవద్దని సూచించారు.
Patnam Mahender Reddy Meets Revanth Reddy: ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలేటట్టు పరిస్థితులు ఉన్నాయి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి ముఖ్యమంత్రిని కలవడంతో రాజకీయాల్లో కలకలం ఏర్పడింది.
Harish Rao Jangaon Meeting: కృష్ణా జలాల వివాదంతో మరోసారి తెలంగాణ రాజకీయాలు వేడేక్కగా.. గులాబీ పార్టీ నాయకులు వెనక్కి తగ్గడం లేదు. అధికార కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేస్తూనే ఉన్నారు. మాజీ మంత్రి, ఆ పార్టీ సీనియర్ నాయకులు హరీశ్ రావు మరోసారి కాంగ్రెస్‌పై, రేవంత్ రెడ్డిపై విరుచుకుపడ్డారు.
KRMB Issue Telangana KCR: కృష్ణా జలాల అంశంపై మరోసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్న మాజీ సీఎం కేసీఆర్‌పై కాంగ్రెస్ పార్టీ నాయకులు విరుచుకుపడుతున్నారు. ఎంపీ ఎన్నికల్లో గెలవలేక ఇలాంటి డ్రామాలకు తెరలేపారని ఒకప్పుడు కేసీఆర్ మంత్రివర్గంలో పని చేసిన జూపల్లి కృష్ణారావు విమర్శించారు.
Sonia Contest In Telangana: అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను లోక్‌సభ సమరంలోనూ పునరావృతం చేయాలనే ఉద్దేశంతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సరికొత్త వ్యూహం రచిస్తోంది. ఈ క్రమంలోనే పార్టీ అధినేత్రి సోనియా గాంధీని తెలంగాణలో పోటీ చేయాలని కొన్నాళ్ల నుంచి విజ్ఞప్తి చేస్తున్నారు. తాజాగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్వయంగా సోనియాను కలిసి ఈ విన్నపాన్ని చేశారు.
Krishna Projects: తెలంగాణలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. కృష్ణా జలాల అంశంపై అధికార, ప్రతిపక్షాల మధ్య సవాళ్లతో తెలంగాణలో జల యుద్ధానికి తెరలేచింది. రేవంత్ రెడ్డి చేసిన సవాల్‌ను మాజీ మంత్రి హరీశ్ రావు స్వీకరించి.. అసెంబ్లీలో చూసుకుందామని ప్రతి సవాల్ విసిరారు.
Kumari Aunty Bigg Boss: కుమారి ఆంటీని బిగ్‌బాస్ పంపించాలి.. లేదంటే రాజకీయాల్లోకి తీసుకుని ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలంటూ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వ స్పందనతో మరోసారి ట్రెండింగ్‌లోకి వచ్చిన కుమారి ఆంటీ పేరు దేశవ్యాప్తంగా మార్మోగింది.
Revanth Reddy Indravelli Tour: ముఖ్యమంత్రి ఎన్నికైన తర్వాత రేవంత్ రెడ్డి తొలిసారి ప్రజల్లోకి వెళ్లడానికి సిద్ధమయ్యారు. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తుండడంతో జిల్లాల పర్యటన చేయాలని నిర్ణయించారు. ప్రభుత్వ వ్యవహారాలను ఒక కొలిక్కి తీసుకొచ్చిన రేవంత్ ఇప్పుడు ప్రజాక్షేత్రంలోకి వెళ్లనున్నారు.
Karimnagar MP Seat: కరీంనగర్ ఎంపీగా సాధించిదేమీ లేదని మాజీ మంత్రి కేటీఆర్ తనపై చేసిన వ్యాఖ్యలపై బండి సంజయ్ ఘాటుగా స్పందించారు. కేటీఆర్ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో సంజయ్ విరుచుకుపడ్డారు. వ్యక్తిగత స్థాయిలో కేటీఆర్‌ను విమర్శించారు.
Seethakka Vs KTR: ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న విమర్శలపై తెలంగాణ మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలోనూ.. ప్రజాక్షేత్రంలోనూ తిప్పికొడుతున్నారు. ఈ క్రమంలోనే మాజీ మంత్రి కేటీఆర్‌పై సీతక్క విరుచుకుపడ్డారు. ప్రగతిభవన్‌లో కేటీఆర్ పెంచుకునే కుక్కల కోసం రూ.12 లక్షలు ఖర్చు చేశారని చెప్పారు. ప్రజా ధనాన్ని లూటీ చేశారని మండిపడ్డారు.
Amit Shah Telangana Tour: సార్వత్రిక ఎన్నికలకు పార్టీ శ్రేణులకు సన్నద్ధం చేసేందుకు బీజేపీ అగ్ర నాయకుడు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన చేపట్టాల్సి ఉండగా.. అనివార్యంగా ఆయన పర్యటన రద్దయ్యింది. మూడు జిల్లాల పర్యటనకు షెడ్యూల్ కారణంగా వేరే ఇతర కారణాలతో ఈ పర్యటన రద్దయ్యిందని బీజేపీ ప్రకటించింది.
KTR meet With Karyakartas: అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన బీఆర్ఎస్ పార్టీ లోక్‌సభ ఎన్నికలకు సిద్ధమవుతున్నది. ఇటీవల పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమీక్ష చేపట్టిన గులాబీ దళం ఇప్పుడు అసెంబ్లీ నియోజకవర్గాలపై సమావేశాలు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో సమావేశానికి వెళ్తూ ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆటోలో ప్రయాణించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
BRS Party: తెలంగాణలో జరుగుతున్న పరిణామాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీమంత్రి కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్ చేసిన ప్రసంగంపై మండిపడ్డారు. గత ప్రభుత్వాన్ని దూషిస్తూ చేసిన ప్రసంగాన్ని కేటీఆర్ ఖండించారు. ఆగమేఘాల మీద ఎమ్మెల్సీ నియామకం చూస్తుంటే కాంగ్రెస్, బీజేపీ అనుబంధం తెలిసివస్తోందని, వారిద్దరిదీ ఫెవికాల్ బంధమంటూ వ్యాఖ్యానించారు.
Lok Sabha Elections: లోక్‌సభ ఎన్నికల్లో సిట్టింగ్ స్థానమైన కరీంనగర్‌ను తిరిగి నిలబెట్టుకోవాలని బీజేపీ భావిస్తోంది. మరోసారి అక్కడి నుంచి బండి సంజయ్‌ను బరిలోకి దింపాలని పార్టీ సూత్రప్రాయంగా నిర్ణయించింది. పార్టీ ఆదేశాల మేరకు సంజయ్ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహిస్తుండగా.. ఆ సభకు అమిత్ షా రానున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.