Rains in Telangana: హైదరాబాద్: నగరంలో శుక్రవారం పలు చోట్ల వర్షం కురిసింది. మధ్యాహ్నం వరకు భానుడి భగభగలు కనిపించినప్పటికీ.. సాయంత్రానికి ఉన్నట్టుండి వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. వర్షానికి ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులు తోడవడంతో పలు చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
Heavy rain in Hyderabad: హైదరాబాద్: సోమవారం సాయంత్రం అనుకోకుండా కురిసిన భారీ వర్షంలో నగరం తడిసి ముద్దయింది. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. పంజాగుట్ట, ఖైరతాబాద్, బంజారాహిల్స్, జూబ్లిహిల్స్, ఫిల్మ్ నగర్, కూకట్పల్లి, నిజాంపేట, బాచుపల్లి, శేరిలింగంపల్లి, సికింద్రాబాద్, తార్నాక, ఉప్పల్, నాంపల్లి, అబిడ్స్తో పాటు పాతబస్తీలోని పలు చోట్ల భారీ వర్షం కురిసింది.
Hilarious incident caught on camera goes viral: టీవీ రిపోర్టర్ లైవ్లో ఉండగా అనుకోకుండా అక్కడ ఏదైనా జరిగి ఆ రిపోర్ట్ అర్ధాంతరంగా ఆగిపోవడం, లేదా ఆ ఘటన హాస్యాస్పదంగా ఉంటే ఆ లైవ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయినటువంటి దృశ్యాలు గతం మీరు ఎన్నో చూసుంటారు. కానీ ఆ తరహా వీడియోల్లో ఇంత ఫన్నీ వీడియో (Funny video) మాత్రం ఇంతకుముందు చూసుండరు... లేదా ఇలా కూడా జరుగుతుందా అని ఊహించి ఉండరు.
ఇటీవల కురిసిన భారీ వర్షాలతో ఇంకా తేరుకోని తెలుగు రాష్ట్రాలకు మరో అల్పపీడన ముప్పు పొంచి ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా సంభవించిన వరదలతో హైదరాబాద్ (Hyderabad Flood) నగరం అస్తవ్యస్తంగా మారింది. ఈ క్రమంలో తెలంగాణ (Telangana) రాష్ట్రంలో రాగల మూడు రోజుల్లో వాతావరణ పరిస్థితులపై హైదరాబాద్ (IMD)వాతావరణ కేంద్రం సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది.
వాయువ్య బంగాళాఖాతంతో పాటు దానిని ఆనుకుని ఉన్న ఒడిశా తీర ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడిందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. అల్పపీడనానికి అనుబంధంగా వుండే ఉపరితల ఆవర్తనం ప్రభావం కారణంగా మంగళవారం కోస్తాలో పలుచోట్ల ఒక మోస్తరు నుంచి భారీవర్షం కురవగా.. రానున్న రెండు రోజుల పాటు కూడా కోస్తాలో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో నేడు, రేపు భారీ వర్షాలు ( Heavy rains) కురుస్తాయని, అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది.
Weather updates: హైదరాబాద్: తెలంగాణలో శుక్ర, శని, ఆదివారాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఇప్పటికే గడిచిన 24 గంటల్లో పలు చోట్ల భారీ వర్షపాతం ( Heavy rainfall ) నమోదైంది.
Weather forecast | అమరావతి: నైరుతి రుతుపవనాల (Monsoon ) ప్రభావంతో ఇప్పటికే తడిసి ముద్దవుతున్న కోస్తాంధ్రకు తాజాగా మరో మూడ్రోజుల పాటు భారీ వర్షాలు ( Heavy rains ) పొంచి ఉన్నాయి. బంగాళాఖాతంపై ఒడిషా తీరంలో నెలకొన్న ఉపరితల ఆవర్తనంతో పాటు ఉపరితల ద్రోణి కూడా కొనసాగుతోందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.
Dust storm in Delhi | న్యూ ఢిల్లీ: భారీ ఉష్ణోగ్రతలతో భగభగ మండుతున్న ఢిల్లీ వాతావరణం బుధవారం సాయంత్రం కురిసిన జల్లులతో ఒక్కసారిగా చల్లబడింది. అయితే, అంతకంటే ముందుగా ఢిల్లీతో పాటు ఎన్సీఆర్ ప్రాంత పరిసరాల్లో ( Delhi-NCR) దుమ్ము తుఫాన్ విరుచుకుపడింది. దుమ్ము తుఫాను వెంటే ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కుండపోతగా కురిసింది.
Weather updates | విశాఖ: తూర్పు మధ్య బంగాళాఖాతంలో రాగల 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం (IMD) వెల్లడించింది. పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ మరో 24 గంటల్లో ఆ అల్పపీడనం మరింత బలపడనున్నట్టు వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
Monsoon rains | అమరావతి: రైతులకు గుడ్ న్యూస్. నైరుతి రుతుపవనాలు ఏపీని తాకాయి ( Monsoon hits AP). జూన్ 7 నాటికి నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ (IMD) ఊహించినట్టుగానే జూన్ 6న రుతుపవనాలు రాయలసీమలోకి ప్రవేశించాయి. కేరళ, కర్ణాటక రాష్ట్రాలను దాటుకుని చిత్తూరు, అనంతపురం జిల్లాల ద్వారా నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాయి.
రైతులకు వాతావరణ శాఖ చల్లటి కబురు తీసుకొచ్చింది. నైరుతి రుతుపవనాలు ఆశించినట్టుగానే జూన్ 1వ తేదీన కేరళను తాకాయి. రుతు పవనాల రాకతో కేరళలో రాష్ట్రవ్యాప్తంగా గత 24 గంటల నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయని భారత వాతావరణ శాఖ ( IMD ) వెల్లడించింది. కేరళలోని కొయికోడ్ జిల్లాలో ( Kozhikode ) భారీ వర్షపాతం నమోదైంది.
నగర శివార్లతో పాటు రంగారెడ్డి జిల్లాలో పలు చోట్ల శనివారం సాయంత్రం భారీ వర్షం ( Heavy rain ) కురిసింది. ముఖ్యంగా మహేశ్వరం మండలంలోని గ్రామాలతో పాటు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ పరిసర ప్రాంతాల్లో ఎడతెరిపిలేకుండా కురిసిన భారీ వర్షం కారణంగా పలు చోట్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
ఉత్తర భారతంలో దట్టమైన పొగమంచు అలుముకుంది. పొగమంచు ప్రభావం ఉత్తర రైల్వే పరిధిలో రైళ్ల రాకపోకలపై స్పష్టంగా కనిపిస్తోంది. ఢిల్లీకి బయల్దేరి, ఉత్తర రైల్వే పరిధిలోకి ప్రవేశించిన 15 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నట్టు భారతీయ రైల్వే ప్రకటించింది.
తెలంగాణ, ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని తాజాగా హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రానున్న మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
బుల్బుల్ తుఫాను పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ వైపు కదులుతుండగా అదే సమయంలో తుఫాను ప్రభావంతో ఒడిషా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.