Telangana weather updates: రాష్ట్రంలో వచ్చే మూడు రోజులు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ పశ్చిమ నైరుతి దిశల నుంచి గాలులు వీస్తాయని వెల్లడించింది.
Weather Updates: దేశంలోని పలు రాష్ట్రాల్లో రాగల 48 గంటల్లో భారీ నుంచి అతి భారీవర్షాలు కురుస్తాయని కేంద్ర వాతావరణశాఖ వెల్లడించింది. క్యుములోనింబస్ క్లౌడ్ ప్రభావం వల్ల మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో భారీవర్షాలు కురుస్తాయని తెలిపింది.
Mahaboobabad Heavy Rains : మహబూబాబాద్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పోటెత్తుతున్నాయి. చెరువులు మత్తడిపోస్తున్నాయి. అనేక చోట్ల రహదారులపైకి వరద నీరు రావడంతో రహదారులు తెగి గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.
Hyderabad Rains:బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో హైదరాబాద్ లో భారీ వర్షం కురిసింది. శుక్రవారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు ఎడతెరపి లేకుండా వర్షం కురిసింది. వరదలతో పలు లోతట్టు ప్రాంతాలు జలమలమయ్యాయి. వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉప్పల్ సర్కిల్ పరిధిలోని రామంతపూర్ లో అత్యధికంగా 71 మిల్లిమీటర్ల వర్షం కురిసింది
Telangana Weather Updates: హైదరాబాద్: నేడు తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. రానున్న మూడు రోజుల పాటు రాష్ట్రం నలుమూలలా అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Weather Updates: తెలుగు రాష్ట్రాలపై చలి పంజా విసురుతోంది. ఉష్ణోగ్రతలు రోజురోజుకు పడిపోతున్నాయి. అత్యల్పంగా వికారాబాద్ జిల్లా మర్పల్లిలో 11.3 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది.
Rains Alert: రాగల మూడు రోజుల్లో ఏపీ, తెలంగాణల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రేపు ఏపీ తీరాన్ని తాకనుంది.
Telangana Weather Report: రానున్న 3 రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. నేడు (మంగళవారం), గురువారం ఉరుములు మెరుపులతో కూడిన వానలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సంచాలకులు పేర్కొన్నారు.
AP, Telangana weather updates: విశాఖపట్నం, హైదరాబాద్: ఉత్తర అండమాన్ సముద్రతీరంలో ఏర్పడిన ఆవర్తనం స్థిరంగా కొనసాగుతోంది. రాగల 24 గంటల్లో ఇది అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
Heavy rainfall in Telangana: తెలంగాణలో నేడు పలు చోట్ల భారీ వర్షాలు, రేపు ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
Heavy rains photos: రానున్న మూడు రోజుల్లో పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ నివేదిక (Weather forecast report) స్పష్టంచేసింది.
Heavy rains in Nirmal: నిర్మల్: తెలంగాణలో ఇటీవల గత కొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో పలు జిల్లాల్లో వరద ముంచెత్తుతోంది. ముఖ్యంగా నిర్మల్ జిల్లాలో వర్షాలు, వరదలు (Floods in Nirmal) పరిస్థితి మరింత భయంకరంగా ఉంది. నిర్మల్‌తో పాటు ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో పలు ప్రాంతాల్లో నీట మునిగిన ఊర్లు, కాలనీలే కనిపిస్తున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.