తూర్పు లఢాఖ్‌లోని గాల్వన్ లోయ (Galwan Valley)లో చైనా సైనికులతో పోరాడుతూ అమరుడైన కల్నల్ బిక్కుమల్ల సంతోష్ బాబు (Colonel Santosh Babu) భార్య సంతోషి యాదాద్రి జిల్లాలో ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్‌గా విధుల్లో చేరారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన సంతోష్ బాబు కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక సాయం అందించడంతో పాటు ఆయన భార్య సంతోషికి కీలక పోస్టింగ్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది.
జూన్ 21న తెలంగాణ ప్రభుత్వం సంతోషిని డిప్యూటీ కలెక్టర్‌గా నియమించడం తెలిసిందే. ఈ క్రమంలో సోమవారం యాదాద్రి జిల్లా డిప్యూటీ కలెక్టర్‌గా విధుల్లో చేరారు. ఆ జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఉద్యోగం, విధులకు సంబంధించి ఇదివరకే హైదరాబాద్‌లో మూడు నెలల శిక్షణ పొందారు సంతోషి. అనంతరం యాదాద్రి భువనగరి జిల్లాకు డిప్యూటీ కలెక్టర్‌గా ఆమెను కేటాయించారు. జనవరి 2021 నుంచి 2024 వరకు ఇదే జిల్లాలో కలెక్టర్‌తో పాటు క్షేత్రస్థాయిలో నిర్వహించాల్సిన విధులపై కల్నల్ సంతోష్ బాబు భార్య సంతోషి శిక్షణ పొందనున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe