Raja Singh VS Asaduddin: టీటీడీ బోర్డు వ్యవహారం.. అసదుద్దీన్‌కు చుక్కలు చూపించిన ఎమ్మెల్యే రాజాసింగ్.. ఏమన్నారో తెలుసా..?

TTD new Board Controversy: గోషా మహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ హైదరబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చినట్లు తెలుస్తొంది. దీంతో మళ్లీ తిరుమల కొత్త బోర్డు అంశం వార్తలలో నిలిచింది. వక్ఫ్ బోర్డుకు అన్ని వేల ఎకరాల భూములు ఎట్లావచ్చాయన్నారు.

Written by - Inamdar Paresh | Last Updated : Nov 3, 2024, 07:40 PM IST
  • అసద్ కు చుక్కలు చూపించిన రాజాసింగ్..
  • వక్ఫ్ బోర్డుకు అన్ని ఆస్తులు ఎలా వచ్చాయని ప్రశ్నలు..
Raja Singh VS Asaduddin: టీటీడీ బోర్డు వ్యవహారం.. అసదుద్దీన్‌కు చుక్కలు చూపించిన ఎమ్మెల్యే రాజాసింగ్.. ఏమన్నారో తెలుసా..?

Raja singh fires on Asaduddin Owaisi: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల తిరుమల తిరుపతి దేవస్థానంకు కొత్త బోర్డును నియమించింది. దీనిలో బీఆర్ నాయుడును టీటీడీ చైర్మన్ గా నియమించడంతో పాటు, 25 సభ్యులను కూడా నియమించింది. అయితే.. కొత్తగా ఎంపిక చేయబడిన బీఆర్ నాయుడు చేసిన మాట్లాడిన కొన్ని అంశాలు ప్రస్తుతం రాజకీయంగా కాకరేపుతున్నాయి. ఇటీవల ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బీఆర్ నాయుడు మాట్లాడుతూ... టీటీడీలో కేవలం హిందువులు మాత్రమే ఉండాలని, అన్యమతస్థులను డిప్యూటేషన్ మీద ఇతర శాఖలకు బదిలీ చేస్తామంటూ కూడా వ్యాఖ్యలు చేశారు.

Add Zee News as a Preferred Source

దీంతో ప్రస్తుతం దీనిపైన రెండు తెలుగు స్టేట్స్ లతో పాటు, దేశంలో కూడా రచ్చగా మారింది. దీనిపై హైదరబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఖండించారు. దేశంలో ముస్లిం వక్ఫ్ బోర్డు, వక్ఫ్ కౌన్సిల్ లో హిందువేతరులకు కూడా చోటు కల్పిస్తు బిల్లు తీసుకొస్తున్నారన్నారు.  అలాంటి క్రమంలో టీటీడీలో మాత్రం కేవలం హిందువులు మాత్రమే ఉండాలనడం ఎంత వరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. హిందువులకు ఒక న్యాయం, ఇతర మతాలకు ఒక న్యాయమా అంటూ ఫైర్ అయ్యారు.

ఇదిలా ఉండగా.. దీనిపైన ప్రస్తుతం వివాదం నడుస్తొంది. ఈ క్రమంలో గోషా మహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఎంపీ అసదుద్దీన్ చేసిన వ్యాఖ్యల్ని ఖండించారు. భారత్ కు ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు వక్ఫ్ బోర్డుకు ఎంత ఆస్తులు,  భూములు ఉన్నాయని ప్రశ్నించారు. వందల, వేల ఎకరాల భూములను వక్ఫ్ పేరిట దోచుకున్నారన్నారు. హిందువుల ఆలయాల భూములు వక్ఫ్ పేరిట కబ్జా చేశారని ఎద్దేవా చేశారు. టీటీడీలో బరాబర్.. హిందువులు మాత్రమే విధుల్లో ఉంటారని, టీటీడీ బోర్డ్ చైర్మన్ కు తన మద్దతుటుందన్నారు.

Read more: Asaduddin Owaisi: తిరుమల ఏమైన మీ జాగీరా..?.. కాకరేపుతున్న ఎంపీ అసదుద్దీన్ సంచలన వ్యాఖ్యలు.. అసలేం జరిగిందంటే..?

అంతే కాకుండా.. వక్ఫ్ పైన చట్టంలో ఎలాంటి మార్పులు ఉండవని, ఎంత ప్రచారం చేసుకున్న ఇక్కడ వెనక్కు తగ్గేవాళ్లు ఎవరు లేరని కూడా రాజాసింగ్ తన దైన స్టైల్ లో ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలకు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. దీంతో ప్రస్తుతం మళ్లీ ఎంఐఎం వర్సెస్ బీజేపీగా రాజకీయాలు చలికాలంలో ఒక్కసారిగా హీటెక్కాయని చెప్పుకొవచ్చు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News