Telangana Heavy Rains: తెలంగాణకు భారీ వర్షాలు.. హై అలర్ట్ జారీ..

Telangana Heavy Rains:తెలంగాణ రాష్ట్రంపై మరోసారి వరుణుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. మధ్యలో వర్షాలకు కాస్త తెరిపి ఇచ్చిన వరుణుడు.. ఇపుడు విజృంభిస్తున్నాడు. తెలంగాణ వ్యాప్తంగా వాతావరణ శాఖ హై అలర్ట్ జారీ చేసింది.

Written by - TA Kiran Kumar | Last Updated : Aug 25, 2024, 08:36 AM IST
Telangana Heavy Rains: తెలంగాణకు భారీ వర్షాలు.. హై అలర్ట్ జారీ..

Telangana Heavy Rains: హైదరాబాద్ సహా తెలంగాణ వ్యాప్తంగా వరుణుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. మధ్యలో కాస్త తెరిపి ఇచ్చినట్టే ఇచ్చి మళ్లీ విజృంభిస్తున్నాడు. నాలుగు రోజులు క్రితం హైదరాబాద్ లో కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. అంతేకాదు పలు ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరింది. దీంతో ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. తెలంగాణలో గతకొన్ని రోజులుగా  ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో జోరుగా వానలు పడుతున్నాయి. తాజాగా.. రాష్ట్రానికి మరోసారి రెయిన్ అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ శాఖ. నేడు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని తెలియజేసింది. దీంతో 18 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. ఉత్తర పశ్చిమ బెంగాల్‌, ఈశాన్య జార్ఖండ్‌ ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడిందని తెలిపింది.

దీంతో మరో రెండు రోజులపాటు రాష్ట్రంలో  భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ రోజు  ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, నారాయణపేట జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది.  

భారీ వర్షంతో పాటు ఉరుములు, మెరుపుల ఉంటాయని.. పలు చోట్ల పిడుగులు కూడా పడే అవకాశాలున్నాయని తెలిపింది. అంతేకాదు ప్రజలు బయటకు వెళ్లేటపుడు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అంతేకాదు అల్ప పీడన ప్రభావంతో  గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశాలున్నాయని తెలిపింది. హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలకు వరద పోటెత్తడానికి కారణం నాలాలా ఆక్రమణ అని తేలడంతో ఇప్పటికే హైడ్రా రంగంలోకి దిగి పలు అక్రమ కట్టడాలను కూల్చే పనిలో పడింది. అయితే.. ఇది రాజకీయంగా తమ ప్రత్యర్థులను టార్గెట్ చేయడానికే అని మాట ప్రతిపక్షాల నుంచి వినిపిస్తోంది. ప్రభుత్వానికి దమ్ముంటే.. అధికార పార్టీలో ఉన్న నేతల అక్రమ కట్టాడాలను ఇదే తరహాలో కూల్చాలని సవాల్ విసురుతోంది.

ఇదీ చదవండి:  చిరంజీవిని మెగాస్టార్ ను చేసిన టాప్ మూవీస్ ఇవే..

ఇదీ చదవండి: ‘భోళా శంకర్’సహా చిరు కెరీర్ లో రాడ్ రంబోలా మూవీస్ ఇవే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News