Big Boss Telugu OTT 2: బిగ్‌బాస్ తెలుగు ఓటీటీ 2 వచ్చేస్తోంది, కంటెస్టెంట్లు ఎవరో తెలుసా

Big Boss Telugu OTT 2: బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8 ముగియవచ్చింది. వచ్చే వారంతో బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8కు తెరపడనుంది. మరోవైపు బిగ్‌బాస్ తెలుగు ఓటీటీ సీజన్ 2కు రంగం సిద్ధమైంది. కంటెస్టెంట్లు ఎవరో కూడా దాదాపుగా ఖరారైందని సమాచారం. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 7, 2024, 05:10 PM IST
Big Boss Telugu OTT 2:  బిగ్‌బాస్ తెలుగు ఓటీటీ 2 వచ్చేస్తోంది, కంటెస్టెంట్లు ఎవరో తెలుసా

Big Boss Telugu OTT 2: టాలీవుడ్ స్టార్ నటుడు అక్కినేని నాగార్జున హోస్ట్ చేస్తున్న బిగ్‌బాస్ తెలుగు అప్పుడే 8 సీజన్లు పూర్తి చేసుకుంటోంది. డిసెంబర్ 15 గ్రాండ్ ఫినాలేతో ముగియనుంది. అదే సమయంలో బిగ్‌బాస్ తెలుగు ఓటీటీ వెర్షన్ మొదలుపెట్టేందుకు బిగ్‌బాస్ యాజమాన్యం ప్రయత్నిస్తోంది. 

బిగ్‌బాస్ తెలుగు ఓటీటీ సీజన్ 2 త్వరలో ప్రారంభం కానుంది. ప్రస్తుతం బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8 చివరి దశకు చేరింది. మరో వారం రోజుల్లో ముగియనుంది. దాంతో బిగ్‌బాస్ ఓటీటీ వెర్షన్‌కు రంగం సిద్ధమౌతోంది. అప్పుడే దీనికి సంబంధించిన వివరాలు లీక్ అయ్యాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జనవరి నుంచి బిగ్‌బాస్ తెలుగు ఓటీటీ 2 ప్రారంభించేందుకు అంతా సిద్ధమైందని సమాచారం. బిగ్‌బాస్ తెలుగు ఓటీటీ వెర్షన్ కంటెస్టెంట్లు ఎవరనేది ప్రాధమికంగా ఖరారైంది. బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8లో మొదట్లోనే ఎలిమినేట్ అయిన శేఖర్ బాషా, అభయ్ నవీన్, సీరియల్ నటి మహేశ్వరి, సీజన్ 7 కంటెస్టెంట్ ప్రియాంక జైన్‌లు ఓటీటీ వెర్షన్‌లో పాల్గొననున్నారు తెలుస్తోంది. వీళ్లతో బాటు యూట్యూబర్ వర్ష, సీజన్ 4 కంటెస్టెంట్ హారిక, బంచిక్ బబ్లూ, జ్యోతి రాజ్, సహార్ కృష్ణన్ ఉండవచ్చు. ఇప్పటికే వీరందరిని బిగ్‌బాస్ టీమ్ కాంటాక్ట్ చేసినట్టు తెలుస్తోంది. 

ఇప్పటి వరకూ ఉన్న సమాచారం ప్రకారం బిగ్‌బాస్ తెలుగు ఓటీటీ 2 వెర్షన్ కు కూడా అక్కినేని నాగార్జునే హోస్ట్ చేయవచ్చని తెలుస్తోంది. వాస్తవానికి ఇది గత ఏడాదే ప్రారంభం కావల్సి ఉన్నా వివిధ కారణాలతో వాయిదా పడింది. బిగ్‌బాస్ టీవీ వెర్షన్ కంటే ఓటీటీ వెర్షనే ఎక్కువ మంది వీక్షించినట్టు గణాంకాలు చెబుతున్నాయి. అందుకే బిగ్‌బాస్ యాజమాన్యం ఓటీటీపై దృష్టి సారించింది. 

Also read: Bigg Boss Telugu 8: బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8 ఈ వారం ఎలిమినేషన్ ఎవరు, ఫైనల్ విజేత అతడేనా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News