Kumar Sahani: చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ హిందీ దర్శకుడు కుమార్ సహాని అనారోగ్యంతో కన్నుమూశారు. ఈయన వయసు 83 యేళ్లు. కోల్‌కతాలోని తన ఇంట్లో జారి పడిపోవడంతో ఈయన మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈయన దర్శకుడిగానే కాకుండా నిర్మాతగా రాణించారు. ముఖ్యంగా 80వ దశకంలో మాయా దర్ఫణ్, ఖయాల్ గత, తరంగ్, కస్బా వంటి పలు సూపర్ హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఈయన 1940 డిసెంబర్ 7న పాకిస్థాన్‌లోని లర్ఖానాలో జన్మించారు.
ముఖ్యంగా కమర్షియల్ చిత్రాలు రాజ్యమేలుతున్న కాలంలో సమాంతర చిత్రాలతో చిత్ర పరిశ్రమలో తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కేవలం దర్శకుడిగానే కాకుండా.. మంచి విద్యావేత్తగా.. రచయతగా తనదైన ముద్ర వేసారు. ఈయన వేసిన బాటలు ఎంతో మంది నూతన దర్శకులకు సినిమాలపై అవగాహన పెంచేలా చేసాయి.
సహాని పూణే ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌టీఐఐ) లో చదువుకున్నారు. అక్కడ దర్వకత్వ శాఖలో మెలుకువలు నేర్చుకున్నారు. ఆ తర్వాత విదేశాల్లో కొన్న సినిమాలకు పనిచేసి దర్శకుడిగా మారారు. ఈయన దర్శకత్వంలో తెరకెక్కిన 'మాయా దర్పణ్' మూవీ జాతీయ ఉత్తమ చలన చిత్రంగా అవార్డు కైవసం చేసుకుంది. దీంతో పాటు ఈయన దర్శకత్వంలో తెరకెక్కిన పలు చిత్రాలు జాతీయ అవార్డులను గెలుచుకున్నాయి. ఈయన మృతిపై బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Kavitha: నిందితురాలిగా చేర్చిన సీబీఐ.. లిక్కర్ స్కామ్‌లో కవిత అరెస్ట్ తప్పదా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook