India Covid-19: 93 శాతంగా కరోనా రికవరీ రేటు

దేశంలో కరోనావైరస్ (Coronavirus) మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. నిత్యం వేల సంఖ్యలో కేసులు వెలుగులోకి వస్తుండగా.. వందల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. అయితే గతంలో నమోదైన కేసులు, మరణాలతో పోల్చుకుంటే.. ప్రస్తుతం రెండింటి సంఖ్య కూడా సగానికి సగం తగ్గింది.

Last Updated : Nov 14, 2020, 10:32 AM IST
India Covid-19: 93 శాతంగా కరోనా రికవరీ రేటు

India Coronavirus updates: న్యూఢిల్లీ: దేశంలో కరోనావైరస్ (Coronavirus) మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. నిత్యం వేల సంఖ్యలో కేసులు వెలుగులోకి వస్తుండగా.. వందల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. అయితే గతంలో నమోదైన కేసులు, మరణాలతో పోల్చుకుంటే.. ప్రస్తుతం రెండింటి సంఖ్య కూడా సగానికి సగం తగ్గింది. దీంతోపాటు కోలుకుంటున్న వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతూనే ఉంది. గత 24 గంటల్లో శుక్రవారం ( నవంబరు 13న ) దేశవ్యాప్తంగా కొత్తగా.. 44,684 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా నిన్న 520 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 87,73,479 కి పెరగగా.. మరణాల సంఖ్య 1,29,188 కి చేరింది. ఈ మేరకు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ (Union Health Ministry) శనివారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది.  Also read: Most Eligible Bachelor Movie: చిచ్చుబుడ్డి కాల్చిన అఖిల్, పూజా హెగ్డే

నిన్న కరోనా నుంచి 47,992 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి ఇప్పటివరకు కరోనా మహమ్మారి బారిన పడి కోలుకున్న (Total cured cases) వారి సంఖ్య దేశంలో 81,63,572 కి పెరిగిందని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. అయితే ప్రస్తుతం దేశంలో 4,80,719 కరోనా కేసులు యాక్టివ్‌గా (active cases) ఉన్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో కరోనా రికవరీ రేటు 93శాతం ఉండగా.. మరణాల రేటు 1.47 శాతం ఉంది. Also read: Crack Movie: మాస్ మాహారాజా.. మాస్ బీట్ చూశారా..?

ఇదిలాఉంటే.. శుక్రవారం దేశవ్యాప్తంగా 9,29,491 కరోనావైరస్ నిర్థారణ పరీక్షలు చేసినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) వెల్లడించింది. ఈ టెస్టులతో కలిపి నవంబరు 13 వరకు దేశంలో మొత్తం 12,40,31,230 నమూనాలను పరీక్షించినట్లు (samples tested) ఎసీఎంఆర్ వెల్లడించింది. 

 

Also read: Malavika Mohanan: అందంతో హీటెక్కిస్తున్న మాళవిక

Also read: Katrina Kaif: మాల్దీవుల్లో కత్రినా ఎంజాయ్.. ఫొటోలు చూశారా?

Also read: Rashmi Gautam: చీరలో వయ్యరాలు ఒలకబోస్తున్న రష్మీ..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe  

Trending News