'కరోనా వైరస్'.. పుట్టిల్లు చైనా. వుహాన్ లో 2019 డిసెంబర్ లో ఈ వైరస్ పుట్టుకొచ్చింది. అక్కడి నుంచి ప్రపంచ దేశాలకు అనతి కాలంలోనే వ్యాపించింది. ఇప్పుడు 200 దేశాలకు పైగా దేశాలను ఈ మహమ్మారి భయపెడుతోంది.
'కరోనా వైరస్'.. లాక్ డౌన్ వేళ. . బాలీవుడ్ ముద్దుగుమ్మలకు ఊసుపోవడం లేదు. కొత్త కొత్త ఛాలెంజ్‌లతో హల్చల్ చేస్తున్నారు. కుర్రకారు మనసు దోచేస్తున్నారు. యువత కూడా కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా ఖాళీగా ఉన్నారు కాబట్టి.. బాలీవుడ్ సెలెబ్రిటీస్ పెట్టిన కొత్త కొత్త ఛాలెంజ్‌లు వైరల్ అవుతున్నాయి. కరోనా వైరస్ కంటే వేగంగా వ్యాపిస్తున్నాయి.
'కరోనా వైరస్'.. శరవేగంగా విస్తరిస్తోంది. వైరస్ దెబ్బకు ప్రపంచవ్యాప్తంగా భయాందోళన నెలకొంది. మనుషుల నుంచి మనుషులకు వ్యాపించే ఈ వైరస్.. అతి కొద్దికాలంలోనే ప్రపంచ దేశాల్లో భీభత్సాన్ని సృష్టించింది. కరోనా మహమ్మారికి చికిత్స చేసేందుకు వైద్యులు, పారామెడికల్ సిబ్బంది నిరంతరం శ్రమిస్తున్నారు.
'కరోనా వైరస్'.. ఆ వలస కూలీల బతుకు చిత్రాన్ని మార్చేసింది. చాలీచాలని బతుకులతో.. గుప్పెడు మెతుకుల కోసం.. గంపెడాశతో కూలీ పని చేసుకుందామని .. పుట్టిన ఊరును వదిలి.. ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారి జీవితం ఇప్పుడు పట్టాలు తప్పింది.
కరోనా వైరస్'... అగ్రరాజ్యం అమెరికాను గడగడలాడిస్తోంది. అత్యాధునిక సాంకేతి పరిజ్ఞానం అభివృద్ధి చెందిన ఆ దేశంలో.. వైరస్ మహమ్మారికి జనం పిట్టల్లా రాలిపోతున్నారు.
'కరోనా వైరస్'.. ప్రపంచవ్యాప్తంగా కరాళ నృత్యం చేస్తున్న వేళ.. ఈ మహమ్మారికి మందు కనుగొనేందుకు పరిశోధకులు ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు కరోనా వ్యాక్సిన్ కోసం కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందుకోసం వివిధ దేశాల్లో శాస్త్రవేత్తలు నిరంతరం శ్రమిస్తున్నారు.
కోవిడ్-19 నివారణ కోసం ప్రభుత్వం విధించిన లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు, పోలీసులు ఎంత వారిస్తున్నా... కొంతమంది ఉల్లంఘనులు నిర్లక్ష్యంగా రోడ్లమీద తిరుగుతూనే ఉన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడలోనూ ఇదే తరహాలో వ్యవహరిస్తున్న ఓ కూల్ డ్రింక్స్ వ్యాపారికి రూ.25 వేల జరిమానా విధించి గట్టి షాక్ ఇచ్చారు కోదాడ మున్సిపల్ కమిషనర్ మల్లా రెడ్డి.
కరోనావైరస్ సంక్షోభంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. వారికి సంఘీభావం వ్యక్తంచేస్తూ శుక్రవారం నాడు తాను ఒక రోజు ఉపవాస దీక్ష చేపడతానని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ప్రకటించారు.
చైనా నుండి ఖరీదు చేసిన కరోనావైరస్ ర్యాపిడ్ టెస్టింగ్ కిట్స్ (coronavirus COVID-19 rapid testing kits from China) పనితీరులో నాణ్యత లోపించిందని.. అటువంటి కిట్స్ కేంద్రం ఎలా కొనుగోలు చేసిందని శివ సేన పార్టీ (Shiv sena slams Modi govt) కేంద్రంపై మండిపడింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే (Maharashtr CM Uddhav Thackeray) అధినేతగా ఉన్న శివసేన.. చైనా ర్యాపిడ్ టెస్టింగ్ కిట్స్ కొనుగోలు విషయంలో కేంద్రంపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేసింది.
'కరోనా వైరస్'.. ప్రభావం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపైనా పడింది. వారికి ఇవ్వాల్సిన కరవు భత్యం ప్రకటనను కేంద్రం వాయిదా వేసింది. జులై 2021 వరకు వారికి కరవు భత్యం ఇవ్వవద్దని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా వైరస్ కారణంగా ఆర్ధిక వ్యవస్థ చిన్నాభిన్నామైనందున ఈ నిర్ణయం తీసుకుంది.
కరోనా వైరస్ వ్యాప్తి (Coronavirus spread) నివారణకు లాక్ డౌన్ (Lockdown) చేపట్టిన నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పన్నుల రూపంలో వచ్చే ఆదాయానికి భారీగా గండిపడిన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ కారణంగా నిలిచిపోయిన వాటిలో ఇండియన్ రైల్వే సేవలు (Indian Railways services) కూడా ఒకటి.
'కరోనా వైరస్' దేశవ్యాప్తంగా విస్తరిస్తోంది. క్రమక్రమంగా మృత్యు క్రీడ ఆడుతోంది. వైరస్ మహమ్మారికి భారత దేశంలో ఇప్పటికే 681 మంది బలయ్యారు. మొత్తంగా దేశంలో 21 వేల 393 మందికి కరోనా వైరస్ సోకింది. దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారిని అడ్డుకునేందుకు లాక్ డౌన్ విధించారు.
'కరోనా వైరస్' ఆర్ధిక వ్యవస్థ కుదేలవుతోంది. భారత దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. వైరస్ మహమ్మారిని వ్యాప్తి చెందకుండా అడ్డుకునేందుకు భారత దేశంలో లాక్ డౌన్ కొనసాగుతోంది. మే 3 వరకు లాక్ డౌన్ అమలులో ఉంటుంది.
'కరోనా వైరస్'.. వేగంగా విస్తరిస్తోంది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించారు. తొలుత 21 రోజులు లాక్ డౌన్ విధించినప్పటికీ .. కరోనా మహమ్మారి లొంగి రాలేదు. ఈ క్రమంలో లాక్ డౌన్ 2.0 విధించారు. మే 3 వరకు లాక్ డౌన్ కొనసాగుతోంది.
'కరోనా వైరస్'.. ప్రపంచవ్యాప్తంగా మృత్యుక్రీడ ఆడుతోంది. వైరస్ కరాళ నృత్యానికి ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు లాక్ డౌన్ పరిధిలోకి వెళ్లిపోయాయి. రోడ్ల మీద వాహనాలు బంద్ అయ్యాయి. ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. వ్యాపారాలు, దుకాణాలు తెరుచుకోవడం లేదు. దీంతో అన్ని దేశాల్లో స్తబ్దత వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో కరోనా వైరస్ కారణంగా ప్రకృతికి మంచే జరుగుతోంది.
ఎర్త్ డే సందర్భంగా మహేష్ బాబు చేసిన ఓ ఎమోషనల్ ట్వీట్ నెటిజెన్స్‌ని బాగా ఆకట్టుకుంటోంది. కరోనావైరస్ సంక్షోభం నేపథ్యంలో లాక్ డౌన్ విధించడంతో జనం అంతా ఇళ్లకే పరిమితమైన సంగతి తెలిసిందే. ఏదైనా చెడు జరిగితే.. అందులోనూ మంచి వెతుక్కుంటూ ముందుకు సాగిపోవాలన్న చందంగా.. లాక్ డౌన్ కారణంగా జనం ఇళ్లలోంచి బయటికి రాకపోవడంతో వాతావరణంలో చాలా చక్కటి మార్పు కనిపిస్తోంది. గాలిలో కాలుష్యం, నీటిలో కాలుష్యం కనుమరుగయ్యాయి. అలా ఏరోజుకు ఆరోజు వాతావరణంలో మార్పు కనిపిస్తోంది. ఇదే విషయాన్ని మహేష్ బాబు కూడా గుర్తు చేస్తూ..
భారత్‌లో కరోనా వైరస్‌ను నియంత్రించే దిశగా సరైన చర్యలు తీసుకుంటున్నారని ప్రశంసిస్తూ భారత ప్రధాని నరేంద్ర మోదీకి టెక్నాలజీ దిగ్గజం, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ బుధవారం ఓ లేఖ రాశారు.
దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. బుధవారం నాడు కొత్తగా 1,486 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 20,471కు చేరుకుంది. గత 24 గంటల్లో 49 మంది కరోనాతో చనిపోయారు. దీంతో ఇప్పటివరకు కరోనావైరస్ కారణంగా చనిపోయిన వారి సంఖ్య 652కి చేరింది.
తెలంగాణలో బుధవారం కొత్తగా మరో 15 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. నేడు గుర్తించిన 15 కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య మొత్తం 943కి చేరింది. అందులో 725 మంది రాష్ట్రంలోని వివిధ ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు.
మే3న ఒకవేళ లాక్డౌన్ ఎత్తేసినా.. ఆ తర్వాత కూడా హోటల్స్, పెద్ద పెద్ద రెస్టారెంట్స్‌పై అక్టోబర్ 15 వరకు లాక్ డౌన్ ఆంక్షలు కొనసాగుతాయని ఇటీవల సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. స్వయంగా కేంద్ర పర్యాటక శాఖ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసినట్లుగా ఉన్న ఓ సర్కులర్ కూడా ఆ వార్తతో పాటే వైరల్ అవుతోంది. అయితే తాజాగా ఈ పుకార్లపై స్పందించిన పర్యాటక శాఖ.. ఆ వార్తలో నిజం లేదని కొట్టిపారేసింది. ఆ సర్కులర్ తాము విడుదల చేయలేదని కేంద్ర పర్యాటక శాఖ వెల్లడించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.