గుజరాత్ లో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. ఈ క్రమంలో రాష్ట్రంలోని పలు ఆస్పత్రుల్లో కరోనా పాజిటివ్ రోగులకు చికిత్స అందిస్తున్నారు. ఐతే సోషల్ మీడియాలో ఓ వార్త విపరీతంగా వైరల్ అవుతోంది.
ఉత్తరప్రదేశ్ మొరాదాబాద్‌లో దారుణం. 'కరోనా వైరస్'.. వ్యాప్తిని అడ్డుకునేందుకు నిరంతరం పని చేస్తున్న వైద్యులు, పోలీసులపై దాడి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ల దాడికి దిగారు. కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్న వేళ .. ఇలాంటి ఘటన జరగడం ఇప్పుడు ఆందోళనకరంగా మారింది.
'కరోనా వైరస్'.. మహమ్మారిని ఎదుర్కునేందుకు దేశవ్యాప్తంగా మొదటగా జనతా కర్ఫ్యూ విధించారు. కానీ ఒక్క రోజుతోనే ఇది తేలే వ్యవహారం కాదని గ్రహించిన కేంద్ర ప్రభుత్వం ఏకంగా 21 రోజులపాటు లాక్ డౌన్ విధిస్తూ నిర్ణయం తీసుకుంది.
'కరోనా వైరస్' వ్యాప్తిని అడ్డుకునేందుకు అవగాహన కల్పించడమే చాలా ముఖ్యం. ఈ క్రమంలో ఎవరికి తోచిన విధంగా వారు కరోనా వైరస్ వ్యాప్తి గురించి తమదైన శైలిలో ప్రచారం చేస్తున్నారు. సినీ, రాజకీయ ప్రముఖులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.
'కరోనా వైరస్'.. మృత్యుక్రీడ ఆడుతున్న వేళ.. భారత దేశవ్యాప్తంగా లాక్ డౌన్ పొడగించారు. మే 3 వరకు లాక్ డౌన్ అమలులో ఉంటుందని ప్రధాని నరేంద్ర మోదీ నిన్న(బుధవారం) ప్రకటించారు. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు ఇవాళ( గురువారం) విడుదలకానున్నాయి. మే 3 వరకు లాక్ డౌన్ కొనసాగిస్తున్నట్లు ప్రకటించడంతో .. దేశవ్యాప్తంగా రైళ్ల రాకపోకలు కూడా రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది.
'కరోనా వైరస్'.. వేగంగా విస్తరిస్తూ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ వైరస్ వ్యాప్తి వేగంగా జరుగుతోంది. నిన్న ఒక్కరోజే తెలంగాణలో 52 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో పాజిటివ్ కేసుల సంఖ్య మొత్తంగా 644కు చేరింది. అటు ఆంధ్రప్రదేశ్‌లోనూ మొత్తం కేసుల సంఖ్య 473గా ఉంది. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు భయాందోళన చెందుతున్నారు.
'కరోనా వైరస్'.. అమెరికాలో అల్లకల్లోలం సృష్టిస్తోంది. వైరస్ అతి దారుణంగా దెబ్బతిన్న దేశం ఏదైనా ఉందంటే అది అమెరికానే కావడం విశేషం. చైనాలో పుట్టిన కరోనా వైరస్.. ఆ దేశం కంటే అమెరికానే ఎక్కువదా దెబ్బతీసింది. ఈ క్రమంలో అగ్రరాజ్యం అమెరికా విలవిలలాడుతోంది.
దేశవ్యాప్తంగా గత పది రోజుల్లో కరోనా కేసుల ఉదృతి పెరుగుతున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లాక్‌డౌన్‌ను మే 3 వరకు పొడిగిస్తూ కీలక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అయితే, ఏప్రిల్ 11న ముఖ్యమంత్రుల
లాక్ డౌన్ కారణంగా మద్యం దుకాణాలు మూతపడటంతో మద్యం ప్రియుల జిహ్వ రుచి తీర్చేందుకు కొందరు దురాశపరులు అక్రమ మద్యం వ్యాపారానికి తెరతీస్తున్నారు. జన సంచారం లేని చోట, అడవుల్లో అక్రమంగా మద్యం తయారుచేస్తూనో లేక నిల్వ చేస్తూనో.. అక్కడి నుంచి మద్యం ప్రియులకు లిక్కర్ సరఫరా చేస్తున్నారు.
'కరోనా వైరస్' విస్తరిస్తున్న క్రమంలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. దీంతో జనం ఇళ్ల నుంచి బయటకు రాకుండా పోలీసులు రోడ్లమీదే పహారా కాస్తున్నారు. ఐతే బయటకు రాకుండా ఉండడంతో జనానికి ఏం తోచడం లేదు.
'కరోనా వైరస్'.. ఎప్పుడు ఎలా సోకుతుందో.. ఎవరూ చెప్పలేని పరిస్థితి. మనుషుల నుంచి మనుషులకు మాత్రమే వ్యాప్తి చెందే ఈ వైరస్ కారణంగా .. ఇప్పుడు ప్రపంచ దేశాలన్నింటిలో అల్లకల్లోల పరిస్థితులు ఉన్నాయి. ధనిక, పేద, ఆడ, మగ, పిల్లలు, పెద్దలు.. ఇలా తేడా లేకుండా అందరికీ ఈ వైరస్ సోకుతోంది.
లాక్ డౌన్ సమయంలో మద్యం విక్రయాలు లేకపోవడంతో.. మద్యాన్ని బ్లాక్‌లో అమ్మి సొమ్ము చేసుకోవాలనే దురుద్దేశంతో పోలీసు వేషం వేసిన ఇద్దరు కేడీగాళ్లు ఆఖరికి ఆ పోలీసులకే చిక్కి కటాకటాలు లెక్కిస్తున్నారు. సోమవారం అర్దరాత్రి కారులో అక్రమంగా మద్యం తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను నర్సంపేట పోలీసులు అరెస్ట్ చేశారు.
'కరోనా వైరస్'.. ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తోంది. భారత దేశంలోనూ క్రమక్రమంగా వ్యాప్తి చెందుతోంది. దేశవ్యాప్తంగా ఇప్పటికే 10 వేల 360 కేసులు నమోదయ్యాయి. కరోనా మహమ్మారితో 339 మంది మృతి చెందారు.
'కరోనా వైరస్' వేగంగా విస్తరిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో రోజు రోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. దీంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. తాజాగా 12 గంటల్లోనే 34 పాజిటివ్ కేసులు నమోదు కావడం గుబులు పుట్టిస్తోంది.
అనుకున్నదే జరిగింది. ఊహించిందే నిజమైంది. 'కరోనా వైరస్' విస్తరిస్తున్న వేళ దేశవ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోదీ లాక్ డౌన్ పొడగించారు. మే 3 వరకు లాక్ డౌన్ పొడగిస్తున్నట్లు ప్రకటించారు. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను రేపు విడుదల చేస్తామని చెప్పారు.
21 రోజుల లాక్ డౌన్ ముగుస్తున్న వేళ ప్రధాని నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో సహకరించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల సహకారంతోనే కరోనా మహమ్మారిని చాలా వరకు అడ్డుకోగలిగామని చెప్పారు. అంతే కాదు కరోనా మహమ్మారి ఇంకా లొంగి రానందున మే 3 వరకు లాక్ డౌన్ పొడగిస్తున్నట్లు స్పష్టం చేశారు.
'కరోనా వైరస్' మహమ్మారిపై ధీటుగా పోరాడేందుకు దేశవ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ మరికొద్ది గంటల్లో ముగియనుంది. ఐతే కరోనా మహమ్మారి ఇప్పటి వరకు లొంగలేదు. దేశవ్యాప్తంగా పెరుగుతున్న పాజిటివ్ కేసుల కారణంగా సర్వత్రా ఆందోళన నెలకొంది. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు.
తెలంగాణలో ఏప్రిల్ 13, సోమవారం నాడు రాత్రి 10 గంటల వరకు కొత్తగా 61 కరోనా వైరస్ పాజిటివ్ కేసులను గుర్తించగా, మరొకరు కరోనాతో మృతి చెందినట్టు రాష్ట్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈమేరకు సోమవారం రాత్రి 10 గంటలకు తెలంగాణ సర్కార్ ఓ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
ఏ స్వార్థం లేకుండా ప్రజాహితం కోసం చేసే సేవ ఏదైనా వారిని గొప్ప వాళ్లను చేస్తుంది. కరోనావైరస్ కాటేస్తోన్న ఈ కష్టకాలంలో ముఖానికి మాస్కులు ధరించడం, తరచుగా హ్యాండ్ శానిటైజర్స్‌తో చేతులు శుభ్రం చేసుకోవడం ఎంతో అవసరం. కానీ నిత్యం రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేదలకు లాక్డౌన్ సమయంలో ఆహారం లభించడమే కష్టం! వారికి మాస్కులు, హ్యాండ్ శానిటైజర్స్ గురించి అవగాహన కల్పించేదెవరు ? అందించేదెవరు ?
'కరోనా వైరస్' వేగంగా విస్తరిస్తున్న క్రమంలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించారు. దీంతో అన్ని వ్యాపారాలు బంద్ అయ్యాయి. జనం ఇళ్ల నుంచి బయటకు రావడం లేదు. దేశవ్యాప్తంగా పోలీసులు కఠినంగా లాక్ డౌన్ అమలు చేస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.