'కరోనా వైరస్'.. ప్రపంచాన్ని గజగజా వణికిస్తోంది. 200 దేశాలకు విస్తరించిన ఈ మహమ్మారి రోజు రోజుకు ప్రపంచ జనాభాకు నిద్రలేని రాత్రులు తీసుకొస్తోంది. కంటి మీద కునుకు లేకుండా జనం భయం గుప్పిట్లో బతుకుతున్నారు.
'కరోనా వైరస్'.. భారత దేశంలో క్రమక్రమంగా విస్తరిస్తోంది. రోజు రోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య ఉద్ధృతమవుతోంది. దీంతో దేశవ్యాప్తంగా ప్రజల్లో ఆందోళన కొనసాగుతోంది.
హైదరాబాద్ ఘట్కేసర్ ప్రాంతంలో ఇవాళ తెల్లవారుజామున అసాధారణ సంఘటన జరిగింది. ఓ నిండు గర్భిణీకి ఆంబులెన్స్‌లోనే డెలివరీ జరిగింది. పండంటి మగబిడ్డకు ఆమె జన్మనిచ్చింది.
'కరోనా వైరస్' వేగంగా విస్తరిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్న ఈ వైరస్.. ఏ ప్రాంతాన్నీ వదిలిపెట్టడం లేదు. భారత దేశంలోనూ రోజు రోజుకు పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి.
మధ్యప్రదేశ్‌లో దారుణం జరిగింది. అంధత్వం ఉన్న వృద్ధురాలిపై కొంత మంది దుండగులు అత్యాచారం చేసి పారిపోయారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లోని షాపూర్లో ఈ దారుణం జరిగింది.
దేశవ్యాప్తంగా 'కరోనా వైరస్' లాక్ డౌన్ కొనసాగుతోంది. మహమ్మారి వేగంగా విజృంభిస్తున్న వేళ.. పోలీసులు పకడ్బందీగా లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు పెట్టేందుకు కూడా వెనకాడడం లేదు. పలు ప్రాంతాల్లో అక్కడికక్కడే వారికి శిక్షలు కూడా విధిస్తున్నారు.
ఓవైపు కరోనా వైరస్‌కు వ్యతిరేకంగా యావత్ దేశం ఏకమై పోరాడుతోంటే (Fighting against COVID-19) .. మరోవైపు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి.కుమారస్వామి శుక్రవారం తన కుమారుడు నిఖిల్ కుమారస్వామి వివాహ వేడుకను (Kumaraswamy`s son Nikhil's wedding) జరిపించారు.
వేసవి వచ్చిందంటే చాలు.. వేసవి తాపం నుంచి బయటపడటం కోసం చాలామంది చూపు కూలర్స్, రిఫ్రిజిరేటర్స్, ఏసీలపై పడుతుంది. కూలర్స్ ఎలాగూ లోకల్ మార్కెట్లో లభిస్తాయి కనుక వాటి కోసం ఆన్లైన్ షాపింగ్ సైట్స్‌లో చూడాల్సిన అవసరం లేదు.
రాష్ట్ర వ్యాప్తంగా లాక్ డౌన్ నేపథ్యంలో హైదరాబాద్ లో ఓ వింత సంఘటన చోటు చేసుకుంది. అదనపు కట్నం కోసం భార్యను కిడ్నాప్ చేసిన సంఘటన నగరంలోని మాసబ్ ట్యాంక్‌లో జరిగింది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం ప్రకారం..
అల్లు అర్జున్ (Allu Arjun) లేటెస్ట్ సెన్సేషన్ అల వైకుంఠపురంలో (ala vaikuntapuramlo) సినిమా 2020 సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలై టాలీవుడ్లో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో పూజా హెడ్గే, నవదీప్, నివేదా పేతురాజ్, సుశాంత్, సునీల్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు.
దేశ వ్యాప్తంగా కరోనా మామ్మారిపై పోరులో కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వానికి నిర్మాణాత్మక మద్దతును ఇస్తుందని, కాగా వికేంద్రీకృత విధానాన్ని అమలుపర్చడంలో కేంద్ర ప్రభుత్వాన్ని రాహుల్ గాంధీ తనదైన శైలిలో తప్పుబట్టారు.
'కరోనా వైరస్'.. కాటేస్తోంది. ఈ సమయంలో ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది. దేశవ్యాప్తంగా మే 3 వరకు లాక్ డౌన్ అమలులో ఉంటుంది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా జరుగుతున్న కొన్ని ఘటనలు ఆందోళనకరంగా కనిపిస్తున్నాయి.
పురపాలక శాఖ మంత్రి కే. తారకరామారావు ఈ రోజు హైదరాబాద్‌లోని కంటైన్మెంట్ జొన్లలో పర్యటించారు. ఖైరతాబాద్ పరిధిలోని సిఐబి క్వార్టర్స్, ఆసిఫ్ నగర్, మల్లేపల్లి కంటైన్మెంట్ జొన్లను సందర్శించిన మంత్రి కే. తారకరామారావు అక్కడి ప్రజలతో మాట్లాడారు. మరింతగా ప్రజలు వైరస్ బారిన పడకుండా కాపాడేందుకు ప్రభుత్వం ముందస్తు చర్యల్లో భాగంగా కొన్ని పరిమితులు విధించిందని, అందులో భాగంగానే కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేసిందని తెలిపారు.
'కరోనా వైరస్'.. మృత్యుక్రీడ ఆడుతోంది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా మే 3 వరకు లాక్ డౌన్ కొనసాగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఐతే ఆర్ధిక వ్యవస్థ కుంటుపడుతున్న క్రమంలో ఈ నెల 20 నుంచి కొన్ని రంగాలకు పాక్షిక సడలింపు ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను కూడా కేంద్రం ప్రకటించింది.
నిజామాబాద్‌లో ఉద్రిక్తత నెలకొంది. 'కరోనా వైరస్' ఉద్ధృతి నేపథ్యంలో పోలీసులు లాక్ డౌన్ ను పకడ్బందీగా అమలు చేస్తున్నారు. మరోవైపు ఢిల్లీ సహా ఇతర ప్రాంతాల్లో తబ్లీగీ జమాత్ మత ప్రార్థనలకు హాజరైన వారు స్వచ్ఛందంగా వైద్యులకు సహకరించాలని చెప్పినా పట్టించుకోవడం లేదు.
'కరోనా వైరస్' ..వేగంగా విస్తరిస్తున్న క్రమంలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ 2.0 కొనసాగుతోంది. మే 3 వరకు లాక్ డౌన్ అమలులో ఉంటుంది. దీంతో ప్రజలను రోడ్లపైకి రావొద్దని..ఇళ్లల్లోనే ఉండాలని ప్రభుత్వాలు సూచిస్తున్నాయి.
రెండో దశలో 'కరోనా వైరస్'.. వేగంగా వ్యాప్తి చెందుతోంది. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలను గడగడా వణికిస్తున్న మహమ్మారి వైరస్ కారణంగా పాజిటివ్ కేసులు 20 లక్షలు దాటిపోయాయి.
భారత్‌లో కరోనా వైరస్ క్రమక్రమంగా విస్తరిస్తోంది. వేగంగా పాజిటివ్ కేసులు నమోదు కావడం అంతటా గుబులు పుట్టిస్తోంది. ఇప్పటి వరకు మొత్తంగా 12 వేల 380 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 10వేల 477 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.
ఏపీలో బుధవారం కొత్తగా మరో 23 కరోనా వైరస్ పాజిటివ్ కేసులను గుర్తించినట్టు ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో ఇప్పటివరకు ఏపీలో మొత్తం కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 525కు చేరింది. కరోనా వైరస్ కారణంగా బుధవారం నాడు ముగ్గురు మృతి చెందారు.
తెలంగాణలో కరోనావైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య మొత్తం 650కి చేరింది. తెలంగాణలో బుధవారం కొత్తగా నమోదైన 6 కరోనా పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం కేసుల సంఖ్య 650కి చేరిందని వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.