ఏపీకి మూడు రాజధానుల బిల్లును వ్యతిరేకిస్తూ సభలో నిరసనలకు దిగిన 17 మంది టీడీపీ ఎమ్మెల్యేలను ఒక్క రోజు పాటు సస్పెండ్ చేస్తున్నట్టు సోమవారం ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏపీ స్పీకర్ తీసుకున్న నిర్ణయం ప్రకారం.. నేడు మంగళవారం జరిగే సమావేశాల్లో ఆ 17 మంది
టీడీపీ సభ్యులకు ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనడానికి వీల్లేదు.
ఏపీకి 3 రాజధానుల బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో భాగంగా సోమవారం ఈ బిల్లుపై సుధీర్ఘ చర్చ జరిగిన అనంతరం టీడీపీ ఎమ్మెల్యేల నిరసనల మధ్యే ఈ బిల్లు ఆమోదం పొందింది. ఆంధ్రప్రదేశ్‌కి మూడు రాజధానుల ఆవశ్యకతపై ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వివరణాత్మక ప్రసంగం ఇచ్చిన తర్వాత సభలో అధిక సంఖ్యలో ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలు ఈ బిల్లుకు తమ ఆమోదం తెలిపారు. బిల్లుకు భారీ మెజార్టీతో మద్దతు లభించడంతో స్పీకర్ తమ్మినేని సీతారాం ఈ బిల్లును ఆమోదిస్తున్నట్లు ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానుల అంశాన్ని మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సచివాలయం ఫైర్ స్టేషన్ వద్ద ఏపీ ప్రభుత్వ వైఖరిపై టీడీపీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు నిరసన వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి మండలి సమావేశం నిర్వహణపై స్పష్టత వచ్చింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూలు ప్రకారం సోమవారమే (జనవరి 20న) ఏపీ కేబినెట్ భేటీ జరగనుంది.
ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మూర్ఖత్వం వల్ల రాష్ట్రానికి ఈ పరిస్థితి వచ్చిందని, రాజధానిని విశాఖపట్నానికి తరలించాలని జగన్ ఒక్కడే నిర్ణయం తీసుకుంటే సరిపోదన్నారు.
రాష్ట్ర రాజధాని అంశం నిర్ణయించడానికి జనవరి 20న ఆంధ్రప్రదేశ్ కేబినెట్ కమిటీ కీలక సమావేశం నిర్వహించనున్నట్లు తేలిపారు. హై పవర్ కమిటీ తన సమర్పించనున్న నివేదికపై జనవరి 20న భేటీలో చర్చించనున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర శాసన సభ కూడా అదే రోజు సమావేశమవుతుందని తెలిపారు.
Amaravati | ప్రస్తుతం ఒక్క రాజధానికే దిక్కు లేదు కానీ, ఏపీకి మూడు రాజధానులు నిర్మిస్తానని జగన్ చెప్పడం విడ్డూరంగా ఉందని చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు.
హైదరాబాద్‌లో సీబీఐ జాయింట్ డైరెక్టర్‌గా ఆంధ్రప్రదేశ్‌కు సంబంధం లేని అధికారిని నియమించాలని కోరుతూ వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి లేఖ రాయడంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. విజయసాయి రెడ్డి విజ్ఞప్తిపై తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తూ కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖకు అమిత్ షా ఓ లేఖ రాశారు.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీబీఐ కోర్టులో హజరయ్యారు. ఆయన తల్లి వైఎస్ విజయమ్మ, సోదరి షర్మిల సైతం ఉమ్మడి ఏపీలో ఎన్నికల కేసులో భాగంగా నేడు విచారణకు హాజరుకానున్నారు.
అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆ ప్రాంత రైతుల పాదయాత్ర.
తూళ్లూరు గ్రామం నుంచి అమరావతి సచివాలయం వరకు పాదయాత్రగా వచ్చిన రైతులు.
9 కిమీ మేర కొనసాగిన పాదయత్రలో పాల్గొన్న రైతులు, మహిళలు, విద్యార్థులు.
పోలీసులు అనుమతి నిరాకరించినా... పాదయాత్ర చేసేందుకు వెనక్కి తగ్గని నిరసనకారులు.
20 రోజులుగా ఆందోళనలు చేస్తున్నాం.. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందిస్తారని ఆశిస్తున్నాం.. లేదంటే రైతులు ప్రాణత్యాగానికైనా వెనుకాడరని నిరసనకారులు చెబుతున్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఘటనకు సంబంధించి ప్రత్యేక న్యాయస్థానం వైఎస్ విజయమ్మ, షర్మిలకు సమన్లు జారీ చేసింది. కోర్టుకు హాజరు కావాలని సమన్లలో సూచించింది.
తరచుగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయాలను, ఆయన పాలనను ప్రశంసించే సినీ విమర్శకుడు కత్తి మహేష్ తాజాగా రూటు మార్చారు. చంద్రబాబుకు, వైఎస్ జగన్ సర్కార్‌కు ఏ తేడా లేదంటూ పోస్ట్ చేశారు.
ఏపీ రాజధాని అంశాన్ని తేల్చేందుకు నియమించిన బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ ( BCG ) తుది నివేదికలో సంచలన విషయాలు వెలుగుచూశాయి. జీఎన్ రావు కమిటీ తరహాలోనే, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, మంత్రులకు అనుగుణంగా రిపోర్టులో పలు అంశాలున్నాయి.
ఏపీకి మూడు రాజధానుల ఏర్పాటులో భాగంగా విశాఖపట్నంను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా చేస్తామని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన ప్రతిపాదనను స్వాగతిస్తున్నట్టు మాజీ మంత్రి, టీడీపీ నేత గంటా శ్రీనివాస రావు చేసిన ప్రకటన అనేక చర్చలకు, సందేహాలకు తావిచ్చింది.
ఏపీకి మూడు రాజధానుల ప్రకటన, అమరావతి నుంచి రాజధాని మార్పు వంటి అంశాలు తెలంగాణలోకి పరిశ్రమలు, పెట్టుబడుల రాకకు అనుకూలంగా మారుతుందని తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు పలు కీలక వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానుల ప్రకటన తర్వాత తొలిసారిగా విశాఖలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వెళ్లిన ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డికి అక్కడ ఘన స్వాగతం లభించింది. అమరావతి నుంచి రాజధానిని తరలించడాన్ని నిరసిస్తూ అమరావతిలో రైతులు, ప్రజా సంఘాలు తీవ్ర నిరసన వ్యక్తంచేస్తుండగా... విశాఖలో మాత్రం అందుకు భిన్నమైన సీన్ కనిపించింది.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో భాగంగా ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన విలీనం హామీని నెరవేర్చారు. ఇచ్చిన మాటకు కట్టుబడి గత శాసన సభ సమావేశాల్లో విలీన ప్రక్రియ బిల్లును ప్రవేశపెట్టగా.. ఆ బిల్లుకు అసెంబ్లీ వెంటనే ఆమోద ముద్ర వేసిన సంగతి తెలిసిందే.
అమరావతి పరిరక్షణ సమితి ప్రతినిధులు మంగళవారం ఎన్టీఆర్ భవన్లో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడుని ( Chandrababu Naidu) కలిశారు. రాజధానిని ఇక్కడ నుంచి తరలించాలని రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవాల్సిందిగా కోరుతూ వివిధ సంఘాల ప్రతినిధులు చంద్రబాబుతో భేటి అయ్యారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.