AP Elections 2024: ఎన్నికలు దగ్గరపడేకొద్దీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో శరవేగంగా మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. ప్రకటించిన ఇన్ఛార్జ్లను కూడా చివరి నిమిషంలో మార్చుతోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.
Zee Telugu News Survey On AP Elections: ఏపీ ఎన్నికల్లో విజయం ఏ పార్టీది..? వైఎస్సార్సీపీ రెండోసారి అధికారంలోకి వస్తుందా..? టీడీపీ-జనసేన కూటమి జగన్ సర్కారుకు షాకిస్తుందా..? ప్రజల తీర్పు ఎలా ఉండబోతుంది..? జీ తెలుగు న్యూస్ సర్వేలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. సర్వే లైవ్ అప్డేట్స్ మీ కోసం..
Pawan Kalyan Elections: తాను స్థాపించిన జనసేన పార్టీకి పవన్ కల్యాణ్ భారీ విరాళం ప్రకటించారు. ఎన్నికల నేపథ్యంలో విరాళాలు సేకరిస్తుండగా ఒక నాయకుడిగా పార్టీకి పవన్ విరాళం అందించారు. ఈ సందర్భంగా రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.
Actor Ali Politics: ప్రత్యక్ష ఎన్నికల్లో ఎన్నాళ్ల నుంచో పోటీ చేయాలని భావిస్తున్నా నటుడు అలీకి అవకాశం మాత్రం దక్కడం లేదు. ఈసారిగా కూడా ఆ అదృష్టం లభిస్తుందా లేదా అనే చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో అలీ కీలక ప్రకటన చేశారు.
Chandrababu: జనసేనతో పొత్తు వలన ఏర్పడిన విబేధాలు, అసంతృప్తులను టీడీపీ అధినేత చంద్రబాబు చల్లార్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా పొత్తుల విషయమై పార్టీ నాయకత్వానికి కీలక సూచనలు చేశారు.
Ex IAS Officer Vijay Kumar: ఇప్పటికే రాజకీయాలతో వేడెక్కిన ఆంధ్రప్రదేశ్‌లో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించింది. పార్టీ పేరేంటి? ఎవరు స్థాపించారు? ఆ పార్టీ లక్ష్యాలేమిటో అనేవి ఆసక్తికరంగా మారాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ పోటీ చేస్తుందా అనే చర్చ జరుగుతోంది.
YS Sharmila DSC: డీఎస్సీ ఉద్యోగాల ప్రకటనపై షర్మిల ప్రభుత్వాన్ని నిలదీశారు. తనపై వ్యక్తిగత విమర్శలు కాదు వీటికి సమాధానం చెప్పాలంటూ ప్రశ్నలు సంధించారు. తన సోదరుడు సీఎం జగన్‌పై ప్రశ్నలు విసిరారు.
Sharmila Tour: వరుస పర్యటనలతో కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అస్వస్థతకు గురయ్యారు. ఈ నేపథ్యంలో సోమవారం నుంచి చేపట్టాల్సిన జిల్లాల పర్యటన వాయిదా పడింది. వైద్యుల సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.
YSRCP Candidates List: రెండోసారి అధికారాన్ని నిలబెట్టుకోవడమే లక్ష్యంగా అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భారీ వ్యూహం రచిస్తోంది. అందులో భాగంగా అభ్యర్థులను మార్పు చేస్తోంది. ఇప్పటివరకు ఐదు విడతలుగా మార్పుచేసిన వైసీపీ తాజాగా ఆరో జాబితాను విడుదల చేసింది. వీటిలో కీలకమైన మార్పులు చేసింది.
EC Review on AP Elections: దేశంలోనే ఆసక్తిగొలిపే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సర్వం సిద్ధమవుతోంది.ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా ఎన్నికలపైనే ప్రధాన చర్చ జరుగుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తుండడంతో ఎన్నికల సంఘం వరుస సమీక్షలు చేస్తోంది.
YSRCP 5th List: ఎన్నికలకు సిద్ధమైన వైఎస్సార్ సీపీ అభ్యర్థుల మార్పులు చేర్పులను కొనసాగిస్తోంది. ఇప్పటికే నాలుగు జాబితాలుగా మార్పులు చేసిన అధికార పార్టీ తాజాగా మరో జాబితాను విడుదల చేసింది. తాజా జాబితాలో నాలుగు ఎంపీ, మూడు అసెంబ్లీ సెగ్మెంట్లకు పార్టీ ఇన్చార్జీలను మార్చేసింది.
All Eyes on Cabinet Meeting: కొన్ని వారాల్లో అసెంబ్లీ ఎన్నికల ప్రకటన వచ్చే సూచనలు కనిపిస్తున్న నేపథ్యంలో ఏపీ మంత్రివర్గ సమావేశం భేటీ అవుతుండడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఎన్నికల వేళ సీఎం జగన్ ఏమైనా కొత్త నిర్ణయాలు తీసుకుంటారా.. ప్రజలకు ఏమైనా తాయిలాలు ప్రకటిస్తారా అనేది హాట్ టాపిక్‌గా మారింది.
IAS Transfers: కొన్ని వారాల్లో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెద్ద ఎత్తున ఐఏఎస్‌లను బదిలీ చేసింది. అనూహ్యంగా అధికారుల బదిలీ చేయడం చర్చనీయాంశంగా మారింది. మూడు, నాలుగు జిల్లాల కలెక్టర్లకు స్థాన చలనం లభించింది.
Babu Two Seats Contest: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల యుద్ధం మొదలైంది. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీలు ఎన్నికల సమరశంఖం పూరించాయి. ఈ క్రమంలో ఇరు పార్టీల మధ్య విమర్శలు మొదలయ్యాయి. టీడీపీలో ఓటమి భయం నెలకొందని.. ఆ భయంతోనే చంద్రబాబు కుప్పంతో మరోస్థానంలో పోటీ చేస్తారనే వార్త కలకలం రేపింది. ఈ విషయాన్ని ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు.
Babu fire on Jagan: ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయం వేడెక్కింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్ 'భీమిలి'లో ఏర్పాటుచేసిన 'సిద్ధం' సభతో ఎన్నికల శంఖారావం పూరించారు. అక్కడ చేసిన ప్రసంగంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కౌంటర్ ఇచ్చారు. మీరు ఎన్నికలకు సిద్ధమైతే.. మేం నిన్ను దించడానికి సిద్ధమని ప్రకటించారు.
AP Politics: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వైఎస్ షర్మిల కేంద్రంగా మారాయి. షర్మిల వర్సెస్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అన్నట్టు పరిణామాలు జరుగుతున్నాయి. ప్రతిరోజు సీఎం వైఎస్ జగన్‌పై షర్మిల చేస్తున్న విమర్శలపై ఏపీ మంత్రులు, వైఎస్సార్ సీపీ నాయకులు తిప్పికొడుతున్నారు. తాజాగా మంత్రి రోజా స్పందిస్తూ షర్మిలపై తీవ్ర విమర్శలు చేశారు.
AP Survey 2024: ఏపీలో ఎన్నికల దగ్గరపడే కొద్దీ సర్వేలు హల్చల్ చేస్తున్నాయి. తాజాగా మూడ్ ఆఫ్ ఏపీ పేరిట మరో సర్వే వెలువడింది. ఈ సర్వే ఫలితాలు చాలా ఆసక్తి రేపుతున్నాయి. అత్యంత సంచలనంగా మారాయి. పూర్తి వివరాలు మీ కోసం..
Glass Symbol Allott: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. అధికార పార్టీపై దూకుడుగా వెళ్తున్న జనసేనకు ఒకేరోజు డబుల్ బొనాంజా తగిలింది. పార్టీలోకి సినీ ప్రముఖులు జానీ మాస్టర్, పృథ్వీరాజ్ చేరగా.. ఇదే రోజు కేంద్ర ఎన్నికల సంఘం గాజు గ్లాస్ గుర్తును తిరిగి కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ రెండు పరిణామాలతో జన సైనికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Ap Voter List 2024: ఏపీ ఓటర్ల తుది జాబితా విడుదలైంది. ఏపీ ఎన్నికల్లో మహిళలే ఫలితాలను నిర్దేశించనున్నారు. పురుషులతో పోలిస్తే మహిళా ఓటర్లు భారీగా ఉండటం ఇందుకు కారణం. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
YS Jagan Starts Election War: సార్వత్రిక ఎన్నికల సమరానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, సీఎం జగన్ మోహన్ రెడ్డి సిద్ధమవుతున్నారు. త్వరలోనే ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. గతంలో మాదిరే ఈసారి కూడా ఉత్తరాంధ్ర నుంచే ఎన్నికల యుద్ధ భేరీ మోగించనున్నారు. 175కు 175 స్థానాలే లక్ష్యంగా జగన్ వ్యూహ ప్రతివ్యూహాలు సిద్ధం చేసుకుని ఎన్నికల యుద్ధానికి దిగుతున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.