Ponguleti Srinivasa Reddy-Bhatti Vikramarka Meeting: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 100 శాతం అధికారంలోకి వస్తుందని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి జోస్యం చెప్పారు. ప్రజల ఆకాంక్షలు కాంగ్రెస్తోనే సాధ్యమని అన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్పై విమర్శలు చేశారు.
CLP Mallu Bhatti Vikramarka : పెద్దపల్లిలో సాగుతున్న సీఎల్పీ మల్లు భట్టి విక్రమార్క పాదయాత్రలో కాంగ్రెస్ పార్టీ వర్గ పోరు రచ్చకెక్కింది. మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు, జడ్పీటీసీ గంటా రాములు వర్గాల మధ్య రచ్చ రోడ్డుకెక్కింది.
Rahul Gandhi Speech in Bharat Jodo Yatra: దెబ్బలు తగిలినా పోరాడే తత్వం తెలంగాణ సమాజానిది. తెలంగాణ ప్రజల గొంతు వినాల్సిందే.. అణచివేయడం కుదరదు. ఇది దేశం మీ నుంచి నేర్చుకునే సందేశం అని చెబుతూ రాహుల్ గాంధీ తెలంగాణ సమాజాన్ని ఆకాశానికెత్తారు.
Mallu Bhatti Vikramarka: నీళ్లు, నిధులు, నియామకాలు లాంటి సమస్యలను పారదోలే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిందో.. టిఆర్ఎస్ ప్రభుత్వం అవే సమస్యలను, ఆత్మగౌరవాన్ని విస్మరించిందని మల్లు భట్టివిక్రమార్క మండిపడ్డారు.
Bhatti With KCR : రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరంటారు. తమ ప్రయోజనాలకు అనుగుణంగా పార్టీలు ఎప్పటికప్పుడు స్టాండ్ మారుస్తుంటాయి. బద్ద విరుధోలుగా ఉన్న పార్టీలు సైతం మిత్రపక్షాలుగా మారిపోతుంటాయి. ఇటీవల బీహార్ లో జరిగిన పరిణామమే ఇందుకు సాక్ష్యం.
Revanth Reddy: తెలంగాణ కాంగ్రెస్ వర్గ పోరు పంచాయితీ ఢిల్లీకి చేరింది. కొన్ని రోజులుగా పార్టీలో జరుగుతున్న పరిణామాలతో ఆగ్రహం ఉన్న హైకమండ్.. ముఖ్యనేతలను ఢిల్లీకి పిలిపించింది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్కతో రాహుల్ గాంధీ డైరెక్షన్ లో కేసీ వేణుగోపాల్ చర్చించారు.
Charminar Bhagya Laxmi Temple: హాట్ హాట్ గా సాగుతున్న తెలంగాణ రాజకీయాలకు ఇప్పుడు చార్మీనార్ కేంద్రంగా మారింది. చార్మీనార్ తో పాటు అక్కడున్న భాగ్యలక్షి మందిర్ చుట్టూ రెండు రోజులుగా కీలక పరిణామాలు జరుగుతున్నాయి.
Revanth Reddy: కాంగ్రెస్ అంటేనే మూడు వర్గాలు.. ఆరు పంచాయతీలు. వర్గ పోరు ఆ పార్టీలో కామన్ అని చెబుతారు. పార్టీ బలంగా ఉన్నా.. బలహీనంగా ఉన్నా ఆ పార్టీ నేతల తీరు మారదని అంటారు. తెలంగాణలోనూ కాంగ్రెస్ పరిస్థితి అలానే ఉంది. పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి దూకుడుగా వెళుతున్నా... పార్టీలోని వర్గపోరు ఆయనకు సమస్యలు తెచ్చి పెడుతోంది.కేడర్ ను గందరగోళంలో పడేస్తోంది.
CLP Leader Bhatti Vikramarka : సంగమేశ్వరం నుంచి రోజుకు మూడు టీఎంసీలు, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యం పెంచి రోజుకు 11 టీఎంసీల నీటిని ఏపీకి తీసుకుపోతుండగా, దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు పడ్డట్లుగా టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరిస్తుందని భట్టి విక్రమార్క ఎద్దేవా చేశారు.
తెలంగాణలో యూనివర్సిటీలను ప్రభుత్వమే కుట్రపూరితంగా నాశనం చేస్తోందని ఆరోపిస్తూ గవర్నర్ కు వినతిపత్రం సమర్పించారు. గవర్నర్ జోక్యం చేసుకుని వర్సిటీలను కాపాడాలని విజ్ఞప్తి చేశారు.
ఉస్మానియా యూనివర్శిటీలోని భూముల్లో అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నాయని రాష్ట్ర కాంగ్రెస్ చేపట్టిన నిరసన ప్రదర్శన తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. ఓయూ క్యాంపస్ లో కబ్జా అయిన భూముల సందర్శనకు
కేంద్ర మాజీ మంత్రి స్వర్గీయ జైపాల్ రెడ్డి 78 జయంతిని పురస్కరించుకొని నెక్లెస్ రోడ్డు వద్ద గల ఘాట్ వద్ద పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి నివాళులర్పించారు.
తెలంగాణ అసెంబ్లీలో సీఎల్పీని స్పీకర్ టీఆర్ఎస్లో విలీనం చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టిన సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క సీఎం కేసీఆర్పై అంతే తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాన్రాను సీఎం కేసీఆర్ ఒక పొలిటికల్ టెర్రరిస్టుగా మారారని ఆరోపించారు.
తెలంగాణలో ప్రస్తుతం అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కునేందుకు రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, తెలుగు దేశం పార్టీ జత కట్టనున్నాయా ? 2019 ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు పొత్తు పెట్టుకోనున్నాయా అనే చర్చ ఇటీవల కాలంలో అధికంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మల్లు భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో టీడీపీతో కలిసి ప్రయాణం చేయడానికి తమకేమీ ఇబ్బందేమీ లేదని, అయితే పొత్తులపై చర్చించేందుకు ఇది సరైన సమయం కాదని అన్నారు. దేశవ్యాప్తంగా కూటమి రాజకీయాలు నడిచే వాతావరణం ఏర్పడింది. తెలంగాణ కూడా ఆ పరిస్థితికి అతీతం కాదు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.