గురువారం సాయంత్రం అఖిలపక్ష సమావేశం ముగిసిన అనంతరం పార్లమెంట్‌లో ఓ ఆసక్తికరమైన సన్నివేశం చోటుచేసుకుంది. అఖిలపక్ష సమావేశంలోకి కేవలం పార్టీ అధినేతలు, అధ్యక్షులు, లేదా పార్టీ ఆదేశానుసారం వెళ్లిన ప్రజాప్రతినిధులకే అనుమతి ఉండటంతో వైఎస్సార్సీపీ ఎంపీలు హాలు బయటే ఉండి సమావేశంలో పాల్గొన్న తమ పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కోసం వేచిచూస్తున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ నేడు తిరుమలకు రానున్నారు. సాయంత్రం 4:30 గంటలకు కొలంబో నుంచి ప్రధాని మోదీ తిరుపతికి చేరుకోనున్నారు. ప్రధానిగా రెండోసారి బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా తిరుమలకు వస్తున్న నరేంద్ర మోదీకి ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు సిద్ధమయ్యాయి.