దీపావళి పండుగ పూట తెలంగాణ (Telangana) లోని ములుగు జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. గోదావరి నదిలో స్నానానికి వెళ్లిన నలుగురు యువకులు గల్లంతయ్యారు. కాగా.. మరో 12 మంది సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు.
తెలంగాణ (Telangana) లో మరో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident ) సంభవించింది. ఔటర్ రింగ్ రోడ్డుపై గుర్తు తెలియని వాహనం ఢికొని ఆరుగురు ఆరుగురు మృతి చెందారు. సంగారెడ్డి జిల్లాలోని పటాన్‌చెర్వు పాటి సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్డుపై మంగళవారం తెల్లవారుజామున ఈ ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
తెలంగాణ (Telangana) లో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident ) సంభవించింది. ఆగి ఉన్న లారీని కారు ఢికొట్టిన ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు (Four persons killed) కోల్పోయారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. మరో ఇద్దరికీ తీవ్రగాయాలయ్యాయి.
పాకిస్తాన్ (Pakistan) దేశంలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. పేషావర్ ( Peshawar) లో మంగళవారం ఉదయం బాంబు ( Bomb blast ) పేలింది. ఈ పేలుడు ఘటనలో ఏడుగురు చిన్నారులు మరణించగా.. మరో 70 మంది చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు.
తమిళనాడు (Tamil Nadu) రాష్ట్రంలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఓ బాణసంచా కర్మాగారం (crackers factory) లో భారీ పేలుడు సంభవించడంతో ఐదుగురు కూలీలు సజీవ దహనమయ్యారు. మరో ముగ్గురు తీవ్ర గాయాల (Five dead and three injured) పాలయ్యారు.
మహారాష్ట్ర ( Maharashtra) లో ఘోర ప్రమాదం సంభవించింది. ప్రయాణికులతో వెళుతున్న బస్సు లోయలో పడటంతో (bus Accident) ఐదుగురు అక్కడికక్కడే మరణించగా.. 35 మంది గాయాలపాలయ్యారు.
కేరళ (Kerala) లో దారుణం చోటుచేసుకుంది. కల్తీ మద్యం (spurious liquor) తాగి ఐదుగురు మరణించిన విషాద సంఘటన రాష్ట్రంలోని పాలక్కాడ్ జిల్లా వలయార్ ప్రాంతంలోని చెల్లనం గిరిజన కాలనీ (Chellanam tribal colony) లో జరిగింది.
భారీ వర్షాలు, వరదల కారణంగా తెలంగాణ రాజధాని హైదరాబాద్ ( Hyderabad ) అతలాకుతలమైంది. చాలా ప్రాంతాలు ఇంకా వరద నీటిలోనే మునిగి ఉన్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా కురిసిన వర్షాలతో.. రెండుసార్లు వెంట వెంటనే వచ్చిన వరదలతో హైదరాబాద్ నగరం భారీగా నష్టపోయింది.
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ను జలప్రళయం మరోసారి ముంచెత్తింది. రెండు రోజుల క్రితం భారీ వర్షాలతో అతలాకుతలమయిన నగరాన్ని భారీ వర్షంతో వరదలు చుట్టుముట్టాయి. ఎటుచూసినా నీరే కనిపిస్తుండటంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. శనివారం రాత్రి నుంచి ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో హైదరబాద్ నగరంలోని లోతట్టు ప్రాంతాలన్నీ నీటమునిగాయి.
ఉత్తరప్రదేశ్ హత్రాస్ (Hathras) లో జరిగిన దారుణ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసును యూపీ ప్రభుత్వం.. ఇప్పటికే సిట్ (SIT) కు అప్పగించగా.. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వ (Central Govt) ఆదేశాలతో ఈ సంఘటనపై కేసు నమోదుచేసిన సీబీఐ (CBI) ముమ్మరంగా దర్యాప్తు చేస్తోంది. ఈ క్రమంలో బుధవారం ఈ సంఘటనపై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు విచారణ, బాధితురాలి కుటుంబసభ్యులు, సాక్షుల రక్షణపై సర్వోన్నత న్యాయస్థానంలో అఫిడవిట్‌ను సమర్పించింది.
భారీ వర్షాల కారణంగా తెలంగాణ రాజధాని హైదరాబాద్ (Hyderabad Rains) పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది. చాలా ప్రాంతాలు ఇంకా వరద నీటిలోనే మునిగిఉన్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా వరదలతో హైదరాబాద్ నగరం భారీగా నష్టపోయింది.
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో నగరం మొత్తం అతలాకుతలమైంది. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లల్లోకి వరద నీరు చేరడంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఎటుచూసినా నీరే కనిపిస్తుండంటంతో భాగ్యనగరవాసులు భయాందోళన చెందుతున్నారు. ఇదిలాఉంటే.. భారీ వర్షాల కారణంగా మరణించిన వారి సంఖ్య తాజాగా 15 కు చేరింది.
తెలంగాణ రాజధాని హైదరాబాద్ (Hyderabad) లో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో ( heavy rains) నగరం మొత్తం అతలాకుతలమైంది. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లల్లోకి వరద నీరు వచ్చిచేరడంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. అయితే భారీ వర్షాల కారణంగా మరణించిన వారి సంఖ్య తాజాగా 11కు చేరింది.
తెలంగాణ రాజధాని హైదరాబాద్ కురుస్తున్న భారీ వర్షాలతో అతలాకుతలమైంది. రెండు రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో నగరం జలమయమయింది. రహదారులు, కాలనీలన్నీ వరద నీటితో దర్శనమిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లల్లోకి వరద నీరు వచ్చిచేరింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.