Cyclone Alert: ఓ వైపు అకాల వర్షాలు, మరోవైపు తుపాను హెచ్చరిక ఏపీను వెంటాడుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడనున్న తొలి సైక్లోన్ కొద్దిరోజుల్లో బలపడనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Cyclone Mocha News: భారత వాతావరణ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం ఏపీ కూడా తూర్పు తీర రాష్ట్రమే కావడంతో రైతులను, తీర ప్రాంత వాసులను మోచా తుపాన్ ముప్పు భయం పట్టుకుంది. ఇప్పటికే అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోయామని.. ఇప్పుడు ఈ తుపాన్ రాకతో ఇంకేం జరగనుందో అని రైతులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
Heavy Rains Alert: మండు వేసవిలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఏపీ, తెలంగాణలో వర్షాలు దంచి కొడుతున్నాయి. ఏపీలో మరో నాలుగైదు భారీ వర్షాలు తప్పవని వాతావరణ శాఖ హెచ్చరించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా రాజధాని హైదరాబాద్‌లో లోతట్టు ప్రాంతాలను వరద నీరు ముంచెత్తింది. రహదారులపై వర్ష నీరు నిలిచిపోవడంతో పలు చోట్ల ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. అధికారులు వెంటనే స్పందించి వరద నీరు తొలగించారు.
Heavy Rains Alert: భగభగ మండే ఎండల్నించి ఉపశమనం లభించింది. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు నమోదవుతున్నాయి. రోడ్లన్నీ జలమయమవుతుంటే అకాల వర్షాల కారణంగా రైతన్నలు లబోదిబోమంటున్నారు.
Heavy Rain Lashes Hyderabad: హైదరాబాద్‌లో భారీ వర్షానికి నిమిషాల వ్యవధిలోనే రోడ్లపైకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. నాలాలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. రెండురోజుల క్రితం సికింద్రాబాద్‌లో జరిగిన మౌనిక దుర్ఘటన దృష్ట్యా గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు అప్రమత్తమయ్యారు.
Heavy Rains to lashes of Telangana more 3 days. గత 2-3 రోజులుగా తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. మరో 3 రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందట.
Heavy Rains in Telangana: కామారెడ్డి జిల్లా బాన్సువాడలో కురిసిన భారీ వర్షం జన జీవనాన్ని అస్తవ్యస్తం చేసింది. అకాలవర్షం వల్ల పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఆరబోసిన వరి ధాన్యం తడిసి ముద్దయింది. ఈ భారీ వర్షం వల్ల రోడ్లు అన్ని జలయం అవడంతో వాహనదారులకు త్రీవ ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
Heavy Rain in Hyderabad: హైదరాబాద్‌లో మరో గంటలో వడగళ్ల వానతో కూడిన భారీ వర్షం కురిసే ప్రమాదం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించినట్టుగానే నగరంలో భారీ వర్షం కురుస్తోంది.
Vadagalla Vaana in Telangana: ఆదివారం ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాలోని పలు మండలాల్లో వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. సుమారు గంట పాటు ఈదురు గాలులతో వడగండ్ల వాన కురవడంతో రైతులే కాకుండా సాధారణ జనం సైతం తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.
Rains Alert for Telugu States: మండు వేసవిలో మరోసారి అకాల వర్షాలు పడుతున్నాయి. తెలుగు రాష్ట్రాలకు మరో రెండ్రోజులు భారీ వర్షాల హెచ్చరిక జారీ అయింది. అన్నదాతలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తోంది.
Rains In AP: ఏపీకి రెయిన్ అలర్ట్. రానున్న మూడు రోజుల్లో ఆయా ప్రాంతాల్లో మోస్తరు నుంచి ఉరుములతో కూడా వర్షాలు అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అదేవిధంగా తెలంగాణలో పలు ప్రాంతాల్లో వడగళ్ల వాన కురుస్తాయని చెప్పారు.
Heavy Rains Alert to AP & TS: తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న అకాల వర్షాలు రేపటి వరకూ కొనసాగనున్నాయి. రాగల 48 గంటల్లో ఇదే వాతావరణం కొనసాగుతుందని ఐఎండీ సూచించింది. ఇప్పటికే ఏపీ, తెలంగాణల్లో ఎల్లో అలర్ట్ జారీ అయింది.
Heavy Rain Alert To AP: ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ ఈదురు గాలులకు వడగళ్లు వాన కురుస్తుండడంతో ప్రజలు భయాందోళనకు గురువుతున్నారు. ఆదివారం, సోమవారం కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
Heavy Rain Alert To AP: ఆంధ్రప్రదేశ్‌ను అకాల వర్షాలు వీడడం లేదు. మరో రెండు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. పలుచోట్ల పిడుగులు పడే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Heavy Rains Alert to Telugu States: ఏపీలో అకాల వర్షాలు కురుస్తున్నాయి. మరో మూడ్రోజులపాటు రాష్ట్రంలో వర్షాలు కురవనున్నాయని ఐఎండీ సూచించింది. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు తప్పవని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.