Revanth Reddy: లోక్‌సభ ఎన్నికల తర్వాత రుణమాఫీ చేస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి అందుకనుగుణంగా చర్యలు చేపట్టారు. పంద్రాగస్టు 15వ తేదీ వరకు రుణమాఫీ చేస్తానని చెప్పిన రేవంత్ దీనికోసం రైతుల రుణాల వివరాలు ఇవ్వాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. రుణమాఫీపై కార్యాచరణ సిద్ధం చేసింది. ఈ మేరకు ఆర్థిక శాఖ అధికారులు రుణమాఫీ ప్రక్రియలో నిమగ్నమయ్యారు. ఎన్నికల్లో రూ.2 లక్షల రుణమాఫీ ఇస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పటివరకు చేయకపోవడంపై తీవ్ర రాజకీయ వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ రుణమాఫీపై బీఆర్ఎస్ పార్టీ నిలదీస్తూ కాంగ్రెస్‌కు ఓటేయొద్దని విజ్ఞప్తి చేస్తూ ప్రచారం చేస్తోంది.
Revanth Reddy Election Campaign In Adilabad: ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి సంచలన ప్రకటనలు చేస్తున్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడిస్తే పథకాలు రావని ప్రజలకు హెచ్చరిస్తున్నారు.
Harish Rao Fire On Revanth Reddy In Medak Election Campaign: లోక్‌సభ ఎన్నికల్లో మెదక్ స్థానం హాట్ హాట్ రాజకీయాలకు వేదికగా మారింది. మెదక్ రాజకీయాలు రేవంత్ రెడ్డి వర్సెస్ హరీశ్ రావుగా మారాయి. మరోసారి రేవంత్‌పై హరీశ్ రావు విరుచుకుపడ్డారు.
Harish Rao Hot Comments On Revanth Reddy: రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్ రావు రెచ్చిపోయారు. అసలు రేవంత్ ముఖ్యమంత్రేనా? అని సందేహాలు వ్యక్తం చేశారు. ఆయనపై తీవ్ర విమర్శలు చేశారు.
Revanth Reddy Fire On KCR In Medak Campaign Rally: మరోసారి బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి రెచ్చిపోయారు. తన ప్రభుత్వాన్ని పడగొట్టలేరని.. కేసీఆర్, మోదీని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.
Supreme Court Probe Adjourn In Cash For Vote Case: ఓటుకు నోటు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు, రేవంత్ రెడ్డికి ఊరట లభించింది. ఈ కేసు విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేయగా.. వారిద్దరిపై ఏపీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు చేశారు.
Supreme Court Probe Cash For Vote Case: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చుట్టూ ఉచ్చు బిగుస్తుందా? వాళ్లిద్దరూ మళ్లీ ఓటుకు నోటు కేసులో చిక్కుకుంటారా? అనేది ఆసక్తికర చర్చ జరుగుతోంది.
Revanth Reddy Surgical Strikes On BJP Amid Lok Sabha Elections: లోక్‌సభ ఎన్నికల వేళ తెలంగాణలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇన్నాళ్లు బీఆర్ఎస్ పార్టీ.. ఇప్పుడు బీజేపీపై రేవంత్ రెడ్డి దృష్టి సారించారు. రేవంత్ దెబ్బకు కాషాయ పార్టీ కకావికాలమవుతోంది.
KTR Comments On Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలకు ముందు చెప్పినట్లే అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలను మోసం చేశాడని అన్నారు. ఇందులో రేవంత్ రెడ్డి తప్పేమి లేదన్నారు.
Revanth Reddy Shock: లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తీవ్ర పరాభావం ఎదురయ్యే అవకాశం ఉంది. లోక్‌సభ ఎన్నికలపై సునీల్ కనుగోలు బృందం ఇచ్చిన నివేదిక రేవంత్ రెడ్డికి భారీ షాక్ ఇచ్చింది. 14 స్థానాలు లక్ష్యంగా పెట్టుకోగా అందులో సగం సీట్లు దక్కవని సునీల్ బృందం నివేదించింది. అసెంబ్లీ ఎన్నికల మాదిరే హైదరాబాద్ చుట్టుపక్కల నియోజకవర్గాల్లో భారీ ఎదురుదెబ్బ తగులుతుందని ఆ కమిటీ వెల్లడించింది. దీంతో రేవంత్ రెడ్డి ఎన్నికల వ్యూహం మార్చేందుకు సిద్ధమయ్యారు.
Sri Rama Navami 2024: భద్రాచలంలో జరగబోయే సీతారామచంద్రుల కల్యాణోత్సవాలపై ఎన్నికల సంఘం తీవ్ర ఆంక్షలు విధించింది. ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాల సమర్పణ ముఖ్యమంత్రి చేయకూడదని తేల్చి చెప్పింది. ఇక ఉత్సవాలు ప్రత్యక్ష చేయరాదని ఆదేశించింది. దీంతో భక్తులతోపాటు ప్రభుత్వ యంత్రాగానికి ఎదురుదెబ్బ తగిలింది. దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో శ్రీరామనవమి వేడుకలపై ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది. ముఖ్యమంత్రి, ఉమ్మడి ఖమ్మం జిల్లా మంత్రులు కూడా ఉత్సవాలకు రాలేకపోవచ్చు.
Revanth Reddy Sensational Comments In Narayanpet Jana Jathara: ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కుమార్తె కవిత బెయిల్ కోసం కేసీఆర్ లోక్‌సభ ఎన్నికలను బీజేపీకి తాకట్టు పెట్టాడు అని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ కమలం పార్టీతో కలిసి పని చేస్తున్నారని తెలిపారు.
Revanth Reddy Class: లోక్‌సభ ఎన్నికల ఏర్పాట్లపై సమీక్షిస్తున్న సమయంలో రేవంత్ రెడ్డిపై పార్టీ అధిష్టానం పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత అజెండా లేకుండా ఎన్నికల్లో అందరి సమన్వయంతో పని చేయాలని పార్టీ దూతలు సూచించారు. ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచార శైలిపై మాట్లాడుతున్న సమయంలో రేవంత్ రెడ్డిని నిలువరించి.. అందరినీ కలుపుకోవాలని సూచించారు.
KT Rama Rao Sensational Comments On Revanth Reddy: ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలను మాజీ మంత్రి కేటీఆర్ తిప్పికొట్టారు. తనపై ఆరోపణలు చేస్తున్న రేవంత్ రెడ్డిపైనే ప్రత్యారోపణలు చేశారు.
Revanth Reddy Master Plan Lok Sabha Elections: లోక్‌సభ ఎన్నికల బాధ్యతను కూడా తీసుకున్న రేవంత్ రెడ్డి ఈ మేరకు భారీ వ్యూహ రచన చేశారు. అత్యధిక స్థానాల్లో గెలుపే లక్ష్యంగా సరికొత్త వ్యూహానికి పదును పెట్టారు.
RS Praveen Kumar Brother RS Prasanna Kumar Joining In Congress Party: బీఆర్ఎస్ పార్టీలో చేరిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు భారీ షాక్ తగలనుంది. ప్రవీణ్ కుమార్ కుటుంబంలో రాజకీయ విబేధాలు ఏర్పడ్డాయి. సొంత తమ్ముడు కాంగ్రెస్‌లో చేరనున్నారనే వార్త కలకలం రేపింది.
Revanth Reddy Govt Will Collapse Says Kishan Reddy: ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుప్పకూలుతుందని బీఆర్ఎస్ పార్టీ వాదిస్తుండగా దానికి కిషన్ రెడ్డి కూడా వత్తాసు పలికారు. వాళ్లలో వాళ్లే కొట్టుకుని ప్రభుత్వాన్ని కూల్చుకుంటారని కేంద్ర మంత్రి జోష్యం చెప్పారు.
Revanth Reddy Narrowly Missed Accident: మరోసారి రేవంత్ రెడ్డి ప్రమాదం బారి నుంచి తప్పించుకున్నారు. సొంత నియోజకవర్గ పర్యటనకు వెళ్తున్న సమయంలో తృటిలో ప్రమాదం తప్పింది. నెలలో ఇలా జరగడం రెండోసారి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.