TTD Arjitha Seva: తిరమలలో శ్రీవారి ఆర్జిత సేవలను తిరిగి ప్రారంభించాలని టీటీడీ ఇటీవల నిర్ణయం తీసుకుంది. తాజాగా ఇందుకు సంబంధించి ఆన్లైన్లో టికెట్లను అందుబాటులో ఉంచింది. టికెట్లను ఎలా బుక్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
Subhash Chandra Visits Tirumala: తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామిని గురువారం దర్శించుకున్నారు రాజ్యసభ సభ్యులు, జీ గ్రూప్ వ్యవస్థాపకులు డా. సుభాష్ చంద్ర. గురువారం ఉదయం వీఐపీ స్పెషల్ ఎంట్రీ దర్శన్ సమయంలో ఆలయానికి విచ్చేసిన ఆయనకు టీటీడీ అధికారులు ఘనస్వాగతం పలికారు. దర్శనం తర్వాత టీటీడీ అధికారులు సుభాష్ చంద్రకు తీర్థప్రసాదాలు అందజేశారు.
ఏపీలోని చిత్తురు జిల్లాలో పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవారి వర్చువల్ ఆర్జిత సేవా టిక్కెట్లు కోటా నేడు విడుదల కానుంది. నేటి ఉదయం 11 గంటలకు ఆన్లైన్లో శ్రీవారి వర్చువల్ ఆర్జిత సేవా టిక్కెట్ల కోటాను టీటీడీ (TTD) విడుదల చేయనుంది. ప్రతినెలా చివరి వారంలో ఆన్లైన్లో శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్ల కోటా విడుదల చేస్తారని తెలిసిందే.
Sarva Darshan Tokens in Tirupati | పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల (Tirumala)లో శ్రీవారి సర్వదర్శనం టోకెన్లను తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) పునఃప్రారంభించింది. నిన్న ప్రకటించినట్లుగానే భూదేవి కాంప్లెక్స్‌లో ప్రత్యేక కౌంటర్ల ద్వారా Tirumala శ్రీవారి సర్వదర్శనం టికెట్లు జారీ చేస్తున్నారు.
TTD to resume Sarva Darshan Tokens | ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో శ్రీవారి దర్శనానికి ఇచ్చే సర్వదర్శనం టోకెన్లపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ఒకరోజు ముందుగానే శ్రీవారి సర్వదర్శనం టోకెన్లు జారీ చేయనున్నారు. టోకెన్లు ఉన్నవారికే అలిపిరి నుంచి కొండపైకి అనుమతి ఇవ్వనున్నట్లు వివరించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.