దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ.. దక్షిణాఫ్రికాతో జరుగనున్న వన్డే సిరీస్‌కు తాను అందుబాటులో ఉంటానని స్పష్టం చేశాడు. అంతేకాదు టీమిండియా పరిమిత ఓవర్ల సారథి రోహిత్ శర్మ, తనకు మధ్య ఎలాంటి విభేదాలు లేవని చెప్పాడు.
BCCI vs Virat Kohli: బీసీసీఐకు టీమ్ ఇండియా మేటి క్రికెటర్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మధ్య దూరం పెరుగుతోంది. దక్షిణాఫ్రికా పర్యటన గురించి..బీసీసీఐకు నేరుగా సమాధానమిచ్చాడు.
ప్రస్తుత పరిణామాలను చూస్తుంటే.. భారత క్రికెట్ జట్టులో ప్రస్తుతం ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. దాంతో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మధ్య విభేదాలు నెలకొన్నాయని సోషల్ మీడియాలో అభిమానులు, నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు.
దక్షిణాఫ్రికా పర్యటనలో విరాట్ కోహ్లీ వన్డే మ్యాచ్‌లకు దూరం కానున్నట్లు మంగళవారం ఓ బీసీసీఐ అధికారి వెల్లడించినట్లు తెలుస్తోంది. అయితే గాయపడిన రోహిత్ శర్మ వన్డే సిరీస్ సమయానికల్లా కోలుకుంటాడని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇటీవల వన్డే కెప్టెన్‌గా విరాట్ కోహ్లీని తప్పించి.. రోహిత్ శర్మకు ఆ బాధ్యతలు అప్పగించింది బీసీసీఐ. దీంతో కెప్టెన్సీ మార్పు విషయంలో ఇద్దరి స్పందన ఏంటి అని చాలామంది ఆసక్తిగా ఎదురుచూశారు. ఈ క్రమంలో తాజాగా కోహ్లీ కెప్టెన్సీ గురించి రోహిత్ స్పందించాడు.
Sourav Ganguly: టీమ్ ఇండియా క్రికెట్లో సమూల మార్పులు చోటుచేసుకుంటున్నాయి. టీ20తో పాటు వన్డే కెప్టెన్‌గా కూడా రోహిత్ శర్మ బాధ్యతలు స్వీకరించాడు. ఈ నేపధ్యంలో బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
India squad for South Africa tour : దక్షిణాఫ్రికాలో పర్యటించబోయే భారత టెస్ట్ టీమ్ ఫైనల్ అయ్యింది. జట్టుకు కెప్టెన్‌గా విరాట్ కోహ్లి వ్యవహరించనున్నారు. వైస్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ ఉండనున్నారు. 18 మంది ఆటగాళ్లతో జట్టును ప్రకటించింది.
ఇటీవలే భారత జట్టు టీ20 పగ్గాలు అందుకున్న రోహిత్ శర్మకు త్వరలోనే మరో బాధ్యత కూడా అప్పజెప్పే యోచనలో బీసీసీఐ ఉన్నట్లు సమాచారం తెలుస్తోంది. టీమిండియా టెస్ట్ వైస్ కెప్టెన్‌గా రోహిత్‌ను ఎంపిక చేసేందుకు బీసీసీఐ ప్రణాళికలు రచిస్తోందట. ప్రస్తుతం టెస్ట్ జట్టు వైస్ కెప్టెన్‌గా ఉన్న అజింక్య రహానేను తప్పించి రోహిత్‌కు ఆ పదవి ఇవ్వనుంది.
Shardul Thakur, Mittali Parulkar's engagement pics: టీమిండియా ఆల్ రౌండర్ శార్థుల్ ఠాకూర్ ఒక ఇంటి వాడు కాబోతున్నాడు. తన గాళ్ ఫ్రెండ్ మిట్టలి పరుల్కర్‌తో శార్థుల్ ఠాకూర్ ఎంగేజ్మెంట్ జరిగింది. అతి కొద్ది మంది బంధుమిత్రులు, సన్నిహితుల మధ్య ముంబైలో నిన్న సోమవారం ఈ ఎంగేజ్మెంట్ సెరెమనీ జరిగింది. టీమిండియా టీ20 జట్టు కెప్టేన్ రోహిత్ శర్మ ఈ నిశ్చితార్థం వేడుకకు హాజరయ్యాడు.
టీమిండియా ఆటగాళ్లు రోహిత్, శ్రేయస్, శార్దుల్ డ్యాన్స్ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ప్రస్తుతం న్యూజిలాండ్ జరుగుతున్న మ్యాచ్ లో శ్రేయస్ సెంచరీతో చెలరేగిన సంగతి తెలిసిందే.
న్యూజిలాండ్ తో జరిగిన మూడో టీ 20 మ్యాచ్ లో ఇష్ సోధి రోహిత్ శర్మ క్యాచ్ పట్టిన తీరు నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. ఆ క్యాచ్ కు రోహిత్ శర్మ కూడా ఎలా ఆశ్చర్యపోయాడో మీరే చూడండి..
ఇండియా Vs న్యూజిలాండ్ మధ్య శుక్రవారం జరిగిన మ్యాచ్ లో ఒక ఆసక్తికర సంఘటన నెలకొంది.. మైదానంలోకి దూసుకొచ్చిన ఒక అభిమాని రోహిత్ కాళ్ల పై పడ్డాడు.. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది.
న్యూజిలాండ్‌పై నేడు జరిగిన 2వ T20 మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 153 పరుగుల స్వల్ప స్కోర్‌తోనే సరిపెట్టుకుంది. అనంతరం కివీస్ జట్టు నిర్దేశించిన 154 పరుగుల విజయ లక్ష్యాన్ని టీమిండియా జట్టు మూడు వికెట్ల నష్టానికి 17.2 ఓవర్లలోనే ఛేధించింది.
టీ20 వరల్డ్ కప్ పరాభవం అనంతరం.. న్యూజిలాండ్ తో (India vs New Zealand 2021) రెండో టీ20 మ్యాచుకు సిద్ధమైంది టీమ్ఇండియా. మూడు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా... శుక్రంవరం జరిగే రెండో టీ20లో ఈ రెండు జట్లు తలపడనున్నాయి.
న్యూజిలాండ్‌పై టీమిండియా విజయంతో టీ20 ఫార్మాట్లో టీమిండియా కెప్టేన్‌గా జట్టు పగ్గాలు చేపట్టిన రోహిత్ శర్మకు, జట్టు కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన రాహుల్ ద్రావిడ్‌కి శుభారంభం లభించినట్టయింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 తేడాతో భారత్ ఆధిక్యం సాధించింది.
టీ20 వరల్డ్ కప్ పరాభవం అనంతరం.. న్యూజిలాండ్ తో (India vs New Zealand 2021) మరో టీ20 మ్యాచుకు సిద్ధమైంది టీమ్ఇండియా. మూడు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా... బుధవారం జరిగే మొదటి టీ20లో ఈ రెండు జట్లు తలపడనున్నాయి.
India vs New Zealand: ప్రపంచకప్ ఫైనలిస్ట్ న్యూజిలాండ్ తో టీమిండియా నేటి నుంచి పొట్టి సిరీస్ ఆడనుంది. కొత్త కోచ్, కొత్త కెప్టెన్ తో భారత్ ఏయే అద్భుతాలు చేస్తుందో చూడాలి. రాత్రి 7 గంటల నుంచి మ్యాచ్ ప్రసారం కానుంది.
BCCI appoints Rohit Sharma as India's T20I Captain: టీ20 వరల్డ్ కప్ 2021 (T20 World Cup 2021) ముగిసిన తర్వాత జట్టు కేప్టేన్సీ బాధ్యతల నుంచి తాను తప్పుకోనున్నట్టు విరాట్ కోహ్లీ ప్రకటించిన నేపథ్యంలో అందరూ ఊహించినట్టుగానే (BCCI) రోహిత్ శర్మను టీ20 ఫార్మాట్‌కి జట్టు కేప్టేన్‌గా బీసీసీఐ నియమించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.