Mocha Cyclone Alert 2023: బంగాళాఖాతంలో ఏర్పడిన మోచా పెను తుపానుగా మారి దూసుకొస్తోంది. ఏపీ, ఒడిశా రాష్ట్రాలు తుపాను నుంచి తప్పించుకున్నా..ఈశాన్య రాష్ట్రాలపై విరుచుకుపడనుంది. ఐఎండీ హెచ్చరికల నేపధ్యంలో రెడ్ అలర్ట్ జారీ అయింది.
గత కొద్దీ రోజులుగా అకాల వర్షాల కారణంగా తెలుగు రాష్ట్రాలు చల్లబడ్డాయి కానీ ఈ రోజు నుండి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణలో ఎండలు దంచి కొట్టనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
Cyclone Mocha live updates: ఈ అల్పపీడనం మోచా తూఫాన్‌గా మారుతున్న నేపథ్యంలో ఈ తుఫాన్ ఏ ప్రాంతంపై ఎక్కువ ప్రభావం చూపిస్తుందనే వివరాలను భారత వాతావరణ శాఖ వెల్లడించింది. మోచా తుఫాన్‌పై వాతావరణ శాఖ నివేదక వివరాలు ఇలా ఉన్నాయి.
Cyclone Mocha Latest News: మోచ తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా ఏపీ సర్కారు తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇప్పటికే జాలర్లు సముద్రంలో వేటకు వెళ్లరాదని తీర ప్రాంతాల్లో జాలర్లకు హెచ్చరికలు జారీ అయ్యాయి.
Cyclone Alert: ఓ వైపు అకాల వర్షాలు, మరోవైపు తుపాను హెచ్చరిక ఏపీను వెంటాడుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడనున్న తొలి సైక్లోన్ కొద్దిరోజుల్లో బలపడనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో ఏప్రిల్, మే నెలల్లో ఎండలు అధికంగా ఉంటాయి. కానీ ఈ సంవత్సరం అధిక వర్షాల కారణంగా వాతావరణం చల్ల బడటంతో ఊపిరి పీల్చుకున్నారు తెలుగు రాష్ట్రాల ప్రజలు. ఇలా మరో రెండు భారీ వర్షాలు ఉండటంతో రైతులు ఆందోళనకు గురి అవుతున్నారు.
Heavy Rains Alert: మండు వేసవిలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఏపీ, తెలంగాణలో వర్షాలు దంచి కొడుతున్నాయి. ఏపీలో మరో నాలుగైదు భారీ వర్షాలు తప్పవని వాతావరణ శాఖ హెచ్చరించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఎప్పుడు లేని విధంగా ఈ నెలలో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షపాతం నమోదైంది. కొంత మంది వేడి నుండి ఉపశమనం పొందుతుంటే.. వడగండ్ల వాన వలన రైతులు ఇబ్బంది పడుతున్నారు. మరో రెండు రోజులు తెలంగాణకు వర్ష సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది.
మూడు రోజుల క్రితం వరకు తెలంగాణలో ఎండలు మండిపోగా.. రాత్రికి రాత్రే వాతావరణంలో మార్పుతో పూర్తిగా చల్లబడింది. రానున్న రోజుల్లో మరిన్ని వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
Heavy Rain in Hyderabad: హైదరాబాద్‌లో మరో గంటలో వడగళ్ల వానతో కూడిన భారీ వర్షం కురిసే ప్రమాదం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించినట్టుగానే నగరంలో భారీ వర్షం కురుస్తోంది.
ఎండాకాలం ప్రారంభంతో వేడికి తెలుగు రాష్ట్రాలు రెండు ఉక్కిరిబిక్కిరి అయిపోయాయి. సతమతం అయిన ప్రజలకు ఊరటగా వాతావరణం చల్ల బడటంతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు. కానీ రాబోయే రోజుల్లో వడగండ్ల వర్షం ఉందని వాతావరణ శాఖ తెలుగు రాష్ట్రాలకు హెచ్చరిక జారీ చేసింది.
IMD Report: నిన్న మొన్నటి వరకి ఎండ వలన ఇంట్లోంచి బయటకు రాలేని పరిస్థితులు ఉండగా.. అకస్మాత్తుగా వాతావరణంలో మార్పుతో తెలుగు రాష్ట్రాల్లో చల్లగా మారింది. ఈ జిల్లాలో పిడుగులు పడే అవకాశం కూడా ఉన్నట్టు వాతావరణశాఖ తెలిపింది.
AP Weather, Heatwave Report: మంగళవారం అనకాపల్లి 17, కాకినాడ 2, కృష్ణా1, నంద్యాల2, విశాఖపట్టణం 2, విజయనగరం 2, వైఎస్ఆర్ కడప జిల్లాలో 3 మండలాల్లో తీవ్రంగా వడగాల్పులు వీచాయి. బుధవారం, గురువారం ఈ వడగాల్పుల తీవ్రత మరింత అధికంగా ఉండే అవకాశం ఉంది.
Summer Temperatures: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతుండటం భయం కల్గిస్తోంది. రానున్న మూడ్రోజులు వడగాల్పుల తీవ్రత మరింత పెరగవచ్చనే హెచ్చరికలు ఆందోళన కల్గిస్తున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
AP Heatwave Report: తెలంగాణ, ఏపీ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో జనం ఇళ్ల నుంచి బయటికి రావాలంటే అల్లాడిపోతున్నారు. ఎంతో తప్పనిసరి అయితే తప్ప ఇల్లు వీడి బయటికి రావడం లేదు. ఇక ఉద్యోగం పని మీద బయటికొచ్చే వాళ్లు, చిరు వ్యాపారులకు అయితే ఎండవేడికి పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయి.
Rains Alert for Telugu States: మండు వేసవిలో మరోసారి అకాల వర్షాలు పడుతున్నాయి. తెలుగు రాష్ట్రాలకు మరో రెండ్రోజులు భారీ వర్షాల హెచ్చరిక జారీ అయింది. అన్నదాతలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తోంది.
Telangana Rains Alert: ఉత్తర, ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడా వడగండ్ల వానలు కురిసే ప్రమాదం లేకపోలేదని తెలుస్తోంది. ఇటీవల కురిసిన వడగండ్ల వానలకు ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ఈ నాలుగు జిల్లాల్లోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా అనేక చోట్ల వడగండ్ల వానలు కురిశాయి.
Heavy Rains Alert to AP & TS: తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న అకాల వర్షాలు రేపటి వరకూ కొనసాగనున్నాయి. రాగల 48 గంటల్లో ఇదే వాతావరణం కొనసాగుతుందని ఐఎండీ సూచించింది. ఇప్పటికే ఏపీ, తెలంగాణల్లో ఎల్లో అలర్ట్ జారీ అయింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.