Coronavirus second wave: కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం గత 24 గంటల్లో భారత్‌లో కొత్తగా 2,73,810 కోవిడ్-19 కేసులు వెలుగుచూశాయి. ప్రస్తుతం విజృంభిస్తున్న కరోనావైరస్ సెకండ్ వేవ్ గురించి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ (ICMR) డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు.
Lockdown In Delhi : దాదాపుగా అన్ని రాష్ట్రాల్లోనూ కోవిడ్19 మహమ్మారి పెను ప్రభావాన్ని చూపుతోంది. దేశ వ్యాప్తంగా 24 గంటల వ్యవధిలో ఏకంగా దాదాపు 3 లక్షల వరకు పాజిటివ్ కేసులు, 1500 మరకు కరోనా మరణాలు నమోదు కావడం పరిస్థితి ఎంతగా దిగజారిపోతుందో సూచిస్తుంది.
ఢిల్లీలో వారం రోజుల పాటు లాక్డౌన్ (Lockdown in Delhi) విధించడం, దేశవ్యాప్తంగా కొవిడ్-19 కేసులు (COVID-19 cases) భారీగా పెరుగుతున్న నేపథ్యంలో కరోనా కట్టడి కోసం దేశవ్యాప్తంగా మరోసారి లాక్డౌన్ (Lockdown in India) విధించే అవకాశాలు ఉన్నాయా అనే అనుమానాలు దేశ పౌరులను వేధిస్తున్నాయి.
Lockdown: దేశంలో కరోనా వైరస్ తీవ్రంగా విస్తరిస్తోంది. రోజువారీ కేసుల సంఖ్య 3 లక్షలకు చేరువలో ఉంది. అటు దేశ రాజధాని ఢిల్లీలో సైతం పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఇప్పటికే నైట్ కర్ఫ్యూ అమల్లో ఉండగా..ఇప్పుడు కొత్తగా వారం రోజుల పాటు లాక్డౌన్ విధిస్తూ కేజ్రీవాల్ నిర్ణయం తీసుకున్నారు.
COVID-19 cases in Delhi: ఢిల్లీ వైద్య, ఆరోగ్య శాఖ సంక్షోభంలో చిక్కుకుంటోంది. స్వయంగా సీఎం అరవింద్ కేజ్రీవాల్ మాటల్లోనే ఈ విషయం స్పష్టమవుతోంది. ఓవైపు ఢిల్లీలో 24 గంటల్లో దాదాపు 24 వేల కరోనా వైరస్ పాజిటివ్ కేసులు వెలుగుచూడటం ఆందోళనకు గురిచేస్తోంటే.. మరోవైపు ఢిల్లీలోని ఆస్పత్రుల్లో ఆక్సీజన్ (Oxygen shortage), లైఫ్ సేవింగ్ డ్రగ్‌గా పేరున్న యాంటి వైరల్ డ్రగ్ రెమిడిసివిర్ వ్యాక్సిన్, ఐసీయూ బెడ్స్‌కి తీవ్రమైన కొరత ఏర్పడుతోంది.
AP Corona Second Wave: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా సెకండ్ వేవ్ వేగంగా విజృంభిస్తోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య రెట్టింపవుతోంది. ఏపీ సెక్రేటేరియట్కు కరోనా సెగ తాకింది. ఏకంగా 60 మందికి పైగా ఉద్యోగులు కరోనా బారిన పడ్డట్ట సమాచారం.
Corona second wave: కరోనా సెకండ్ వేవ్ మరింత ప్రమాదకరంగా మారింది. గంటల వ్యవధిలో కమ్యూనిటీ స్ప్రెడ్ జరిగింది. కోవిడ్ నిబంధనల్ని పాటిస్తూ జాగ్రత్తలు తీసుకుంటేనే వైరస్ కట్టడి సాధ్యమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Actor Sonu Sood Latest Updates : ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 60 దేశాలకు సైతం కోవిడ్19 వ్యాక్సిన్ అందజేసిన ఘనత భారత్ సొంతం. కానీ అంతలోనే పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. కొన్ని రోజులుగా దేశంలో లక్షన్నరకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.
Theatre Rates New GO: కరోనా సంక్షోభం, లాక్డౌన్ అనంతరం గాడిన పడుతున్న సినీ పరిశ్రమకు ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త జీవో నిరాశ మిగుల్చుతోంది. సినిమా విడుదల సమయంలో టికెట్ ధరలు పెంచడాన్ని ప్రభుత్వం నిరాకరించింది.
Lockdown again: దేశంలో కరోనా సెకండ్ వేవ్ శరవేగంగా విస్తరిస్తోంది. మహారాష్ట్ర తరువాత అత్యధికంగా కరోనా కేసులు కర్నాటకలో నమోదవుతున్నాయి. ప్రజలు మాట వినకపోతే లాక్డౌన్ విధించాల్సి వస్తుందనే హెచ్చరికలు చేస్తోంది ప్రభుత్వం.
Maharashtra: మహారాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కరోనా వైరస్ మరోమారు కల్లోలం సృష్టిస్తుండడంతో లాక్‌డౌన్‌పై సమాలోచనలు చేస్తోంది మహారాష్ట్ర ప్రభుత్వం.
Telangana: దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితి. ముఖ్యంగా తెలంగాణలో పరిస్థితిని మంత్రి ఈటెల రాజేందర్ సమీక్షించారు. అదనంగా నాలుగు కోవిడ్ సెంటర్లు ఏర్పాటు చేశారు.
Coronavirus positive cases in Telangana: హైదరాబాద్: తెలంగాణలో కొద్దిరోజుల క్రితం వరకు అదుపులో ఉన్నట్టుగా కనిపించిన కరోనావైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య మళ్లీ క్రమక్రమంగా పెరుగుతోంది. శుక్రవారం రాత్రి 8 గంటల వరకు అందిన సమాచారం ప్రకారం రాష్ట్రంలో కొత్తగా 2,909 మందికి కరోనా సోకినట్టు వైద్య ఆరోగ్యశాఖ గుర్తించింది. మరోవైపు దేశ రాజధాని ఢిల్లీ, మహారాష్ట్రలో (COVID-19 cases in Maharashtra) పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉండగా తమిళనాడు, కర్ణాటకలోనూ కేసులు క్రమక్రమంగా పెరుగుతున్నాయి.
Corona Second Wave: దేశంలో కరోనా సెకండ్ వేవ్ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. భారీగా నమోదవుతున్న కేసులతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపధ్యంలో సోనూ సూద్ మరోసారి వార్తల్లో నిలుస్తున్నారు. ఈసారి మెగా వ్యాక్సిన్ డ్రైవ్‌కు సిద్దమవుతున్నారు.
Night curfew in Delhi: న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనావైరస్ కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీ సర్కారు అప్రమత్తమైంది. పెరుగుతున్న కొవిడ్-19 కేసులను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రతీ రోజు రాత్రి 10 గంటల నుంచి తెల్లవారిజామున 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ విధిస్తున్నట్టు ఢిల్లీ సర్కార్ (Delhi govt) స్పష్టంచేసింది.
IPL 2021 Latest News : ఇటీవల ఇద్దరు ఐపీఎల్ క్రికెటర్లతో పాటు మొత్తం 20 మందికి కోవిడ్-19గా తేలడంతో అనుమానాలు మొదలయ్యాయి. ఈ సీజన్ వాయిదా పడనుందని, లేదా మరోసారి విదేశాలలో నిర్వహించనున్నారా అనే చర్చ మొదలైంది.
Covid-19 guidelines in Bengaluru: కర్ణాటకలో కరోనావైరస్ కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే ప్రజల కదలికలపై తీవ్ర ఆంక్షలు విధించిన కర్ణాటక సర్కార్ తాజాగా శుక్రవారం నాడు పబ్బులు, షాపింగ్ మాల్స్, సినిమా హాల్స్ విషయంలో కొత్తగా మరిన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది.
Covid-19 latest updates from across India: న్యూఢిల్లీ : హోలీ పండగ కంటే ముందే కరోనా మరోసారి విజృంభిస్తోంది. పెరుగుతున్న కరోనావైరస్ కేసులు ప్రజానీకాన్ని మరోసారి ఆందోళనకు గురిచేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక అధికార యంత్రాంగాలు సైతం ఆంక్షలు కఠినతరం చేశాయి. ఇంకొన్ని చోట్ల మళ్లీ లాక్డౌన్ లేదా నైట్ కర్ప్యూ (Lockdown or night curphew) పెట్టాల్సిన దుస్థితి ఏర్పడింది. అదే సమయంలో మార్చి 29న జరగనున్న హోలీ పండగపై (Holi festival 2021) కూడా ఇప్పటికే పలు రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన ఆంక్షలు విధించాయి.
Schools and colleges in Telangana: హైదరాబాద్: తెలంగాణలో విద్యా సంస్థలు పునఃప్రారంభించిన అనంతరం విద్యా సంస్థల్లో కరోనా కేసులు భారీగా పెరుగుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యా సంస్థల్లో పెరుగుతున్న కరోనా కేసులకు చెక్ పెట్టేందుకు రేపటి నుంచి తాత్కాలికంగా విద్యాసంస్థలను మూసివేయనున్నట్టు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి అసెంబ్లీ సమావేశాల్లో (TS Assembly session) ప్రకటించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.